Swapna Shastra: ఇలాంటి కలలు వస్తుంటే..స్వప్న శాస్త్ర ప్రకారం.. మీ పూర్వీకుల ఆసంతృప్తికి అవి సూచనలు.. విస్మరించవద్దు
కలలో తరచుగా ఇలాంటి సంకేతాలు కనిపిస్తుంటే.. మీ పితృదేవతలు మీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని అర్ధం.. అశుభకరంగా భావించాల్సిన కొన్ని కలల గురించి ఈరోజు తెలుసుకుందాం..

Swapna Shastra: నిద్రపోతున్న సమయంలో కలలు కనడం సర్వసాధారణం. ఆ కలలో జంతువులు, మొక్కలు, రకరకాల సన్నివేశాలు కనిపిస్తుంటాయి. అయితే జ్యోతిషశాస్త్రం ఆ కలలకు.. వివిధ అర్థాలను వివరించింది. స్వప్న శాస్త్రం ప్రకారం.. మీ కలలో పూర్వీకులను పదేపదే చూస్తుంటే.. ఈ కలను వృధాగా పరిగణించవద్దు. ఈ కలల ద్వారా మీ పూర్వీకులు మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారనే దానికి సంకేతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే కొన్నిసార్లు కలల ద్వారా, పూర్వీకులు మీ పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చు.. అంతేకాదు కొన్నిసార్లు మీ పితృదేవతలు ఆ కలలు ద్వారా మీ పట్ల ఆనందాన్ని కూడా వ్యక్తం చేయవచ్చు. కలలో తరచుగా ఇలాంటి సంకేతాలు కనిపిస్తుంటే.. మీ పితృదేవతలు మీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని అర్ధం.. అశుభకరంగా భావించాల్సిన కొన్ని కలల గురించి ఈరోజు తెలుసుకుందాం..
కలలో కష్టాల్లో ఉన్న పితృదేవతలు కనిపిస్తే.. కలలో మీ పితృదేవతలు ఏవో కష్టాల్లో ఉన్నట్లు కనిపిస్తే.. మీ పెద్దలు ఆహారం లేదా నీరు మొదలైన ఆహారపదార్ధాలను అడుగుతున్నట్లు కనిపిస్తే.. చెడుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. మీ పూర్వీకులు కొంత ఇబ్బందుల్లో ఉన్నారని అర్థం. అటువంటి పరిస్థితిలో.. వారి బాధలను తొలగించడానికి.. దానాలు చేయాల్సి ఉంటుంది. గీత లేదా రామాయణం పఠించాలి. ఈ చర్యలు మీ పితృదేవతల ఆత్మకు శాంతిని ఇస్తాయి.
కాకిని కొడుతున్నట్లు కనిపిస్తే.. పితృ పక్షం సమయంలో కాకిని పెద్దలుగా భావించి ఆహారం పెడతారు. ఈ కాకి ఆ ఆహారాన్ని పూర్వీకుల వద్దకు తీసుకువెళుతుందని నమ్మకం. మీ కలలో కాకి కొడుతున్నట్లు కనిపిస్తే.. మీ పూర్వీకులు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు ఎక్కడ మీ పితృదేవతలకు కోపం తెచ్చేలా తప్పు చేశారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దీనితో పాటు తర్పణం, శ్రాద్ధం, పూర్వీకులకు దానధర్మాలు చేయాలి.




పితృదేవతలు ఏడుస్తున్నట్లు కనిపిస్తే.. కలలో పూర్వీకులు ఏడుస్తున్నట్లు కనిపిస్తే.. ఈ కల మీ పూర్వీకులకు ఇంకా మోక్షం లభించలేదనడానికి సంకేతం. వారు కలత చెందుతున్నారని ఈ కలకు అర్ధం. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ పూర్వీకుల మోక్షానికి బ్రాహ్మణులకు విందుభోజనం పెట్టి.. దానాదికార్యక్రమాలు నిర్వహించాలి. పితృదేవతల మోక్షం కోసంగీతాపఠనం.. చదివి భగవంతుడిని ప్రార్థించాలి.
పితృదేవతల కోపం తీర్చడానికి.. మీ కలలో మీ పూర్వీకులు మీపై కోపంగా ఉంటే.. దీనికి కారణం ఇంట్లో పితృ దోషం వల్ల కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో.. మీరు జ్యోతిష్కులను సంప్రదించి.. తగిన పరిష్కారం తీసుకోవాలి. పితృ దోషం మొత్తం కుటుంబాన్ని కష్టాల పాలుజేస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)