AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: చెప్పుల స్టాండ్ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ సంపాదన మంచి నీళ్లులా ఖర్చు అయిపోవడం ఖాయం..

ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో చెప్పులు వేసుకుంటున్నారు. చెప్పులు బూట్లు తరచుగా ఇంట్లో తలక్రిందులుగా ఉంటాయి. ఇలా ఉంటే ఇంట్లో వాస్తు దోషం ప్రభావం తప్పదు. వాస్తు శాస్త్రంలో పాదరక్షల గురించి చాలా నియమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Vastu Tips: చెప్పుల స్టాండ్ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ సంపాదన మంచి నీళ్లులా ఖర్చు అయిపోవడం ఖాయం..
vastu tips
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 13, 2023 | 6:27 PM

Share

ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తును నమ్ముతున్నారు. ఏ పని ప్రారంభించినా వాస్తు ప్రకారమే చేస్తున్నారు. చివరికి ఇంట్లో నుంచి కాలు భయటపెట్టాలన్నా వాస్తు, సమయం చూస్తున్నారు. వాస్తు ప్రకారంగా ముందుకు సాగుతేనే జీవితంలో శ్రేయస్సు, ఆనందం లభిస్తుందని నమ్ముకం. అయితేచాలామంది ఇంటి వాస్తును చాలా నమ్ముతారు. ఇంట్లో ప్రతి వస్తువూ వాస్తు ప్రకారమే ఉండాలనుకుంటారు. అలాంటి విషయాల్లో అస్సలు రాజీపడరు. ఎందుకంటే వాస్తు శాస్త్రంలో చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.

అయితే చాలామంది ఇంటి ముందు చెప్పులు, బూట్లు ఇష్టానుసారంగా పడేస్తుంటారు. ఇంటిముందు చెప్పులు ఉంచకూడదుని తరచుగా పెద్దలు చెబుతూనే ఉంటారు దాని వెనక కారణం చాలా తక్కుమ మందికే తెలుసు. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో చెప్పులు వేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో, బూట్లు తరచుగా ఇంట్లో తలక్రిందులుగా ఉంటాయి, దీని కారణంగా ఇంట్లో వాస్తు దోషం సంభవిస్తుంది. వాస్తు శాస్త్రంలో పాదరక్షల గురించి చాలా నియమాలు ఉన్నాయి.

పాదరక్షలను తలకిందులుగా ఎందుకు ఉంచకూడదో వాస్తు నియమాలను తెలుసుకుందాం:

పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం, బూట్లు ఎప్పుడూ ఇంట్లో తలక్రిందులుగా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అదే సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కుటుంబ సంతోషానికి భంగం కలుగుతుంది. అంతే కాదు కుటుంబ సభ్యుల విశ్వాసం కూడా తగ్గుతుంది. ఇంట్లో తలక్రిందులుగా ఉంచిన బూట్లు, చెప్పులు ఇంట్లోకి వ్యాధులను ఆహ్వానిస్తాయని నమ్ముతారు. అదే సమయంలో, పాదరక్షలు, ఇంటి ముందు చెప్పులు తలక్రిందులుగా ఉంచి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు, దాని కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంట్లో తలకిందులుగా ఉండే బూట్లు, చెప్పులు కూడా సభ్యుల ఆలోచనలపై చెడు ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో పాటు ఇంట్లోని ప్రజల సంతోషం, శాంతి కూడా దూరం అవుతాయి.

గదికి ఇటువైపు బూట్లు ఉంచండి:

తరచుగా ఇంటి మెయిన్ డోర్ దగ్గర షూ స్టాండ్ ఉంచుతారు, తద్వారా ఇంట్లోకి వెళ్లేముందు స్టాండ్ నుంచి షూస్ తీసేయవచ్చు. అయితే షూ స్టాండ్ ఎప్పుడూ మెయిన్ డోర్ దగ్గర ఉండకూడదు. ఇది కనీసం 2 నుండి 3 అడుగుల దూరంలో ఉండాలి. అంతే కాదు, షూ స్టాండ్ పూజ గది లేదా వంటగది గోడ పక్కన ఉండకూడదని గుర్తుంచుకోండి.

వాస్తు ప్రకారం, షూ స్టాండ్‌లకు పశ్చిమ, నైరుతి దిశలు శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. అలాగే షూ స్టాండ్ ఉత్తరం, ఆగ్నేయం లేదా తూర్పు దిశలో ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అదే సమయంలో, పడుకునే మంచం కింద బూట్లు, చెప్పులు ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం చెడిపోతుందని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..