Vastu Tips: మీ వంట గదిలో ఈ వస్తువులు ఉన్నాయా.? రోగాలకు వెల్‌కమ్ చెబుతున్నట్లే..
ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వ్యక్తులపై ప్రభావం చూపుతుందని నమ్మే వారు మనలో చాలా మంది ఉంటారు. అందుకే ఇంటి నిర్మాణంలో వాస్తు చిట్కాలను తప్పకుండా పాటిస్తుంటారు. కేవలం వాస్తు మాత్రమే కాకుండా ఇంట్లో ఉంచే వస్తువులు కూడా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వాస్తు..
ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వ్యక్తులపై ప్రభావం చూపుతుందని నమ్మే వారు మనలో చాలా మంది ఉంటారు. అందుకే ఇంటి నిర్మాణంలో వాస్తు చిట్కాలను తప్పకుండా పాటిస్తుంటారు. కేవలం వాస్తు మాత్రమే కాకుండా ఇంట్లో ఉంచే వస్తువులు కూడా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంట గదిలో సరైన విధానాలు పాటించకపోతే ఆరోగ్యంపై ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. కిచెన్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని కొన్ని వస్తువులు ఏంటి.? దానివల్ల ఇంట్లో వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న వివరాలు మీకోసం..
* వంటగదిలో అద్దం లేకుండా చూసుకోవాలి. ఇటీవల చాలా మంది వంట గదుల్లోనూ అద్దాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురువతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కిచెన్‌లో ఉండే స్టవ్ అద్దంలో రిఫ్లెక్ట్ అవుతే ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయని చెబుతున్నారు.
* వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడని వస్తువుల్లో చీపురు ఒకటి. ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురు వంట గదిలో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. చీపురును వంట గదిలో పెడితే ఇంట్లో తిండికి కొరత ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చీపురును ఎవరికీ కనిపించని చోట ఉంచడం ఉత్తమమని సూచిస్తున్నారు.
* కొందరు వంట గదుల్లో ఉండే డబ్బాల్లో మాత్రలను (మందులు) ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుందని చెబుతున్నారు. ఇంట్లో రోగులు పెరుగుతారని ఎట్టి పరిస్థితుల్లో వంట గదిలో మాత్రలను ఉంచకూడదని సూచిస్తున్నారు.
* ఇక వంట గదిలో విరిగిన పాత్రలను ఉంచకూడదు. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావం పడుతుంది. తుప్పు పట్టిన పాత్రలను కూడా వంట గదిలో ఉంచకూడదు. అలాగే పలిగిన పాత్రలో ఆహారం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల ఆహారానికి కొరత ఏర్పడుతుందని వాస్తు నిపుణుల సూచన.
* కొందరు పాడై పోయిన ఆహారాన్ని కూడా కిచెన్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల పేదరికంతో ఇబ్బంది పడాల్సిన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం పాడైతే వెంటనే పాడేయాలని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన అంశాలు కొందరు వాస్తు నిపుణుల అభిప్రాయాల మేరకు అందించినవి మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గుర్తించగలరు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..