Ayodhya Ram temple: అయోధ్య రామమందిరం కోసం తెలంగాణ వ్యాప్తంగా విరాళాల సేకరణ.. తేదీలను ప్రకటించిన ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
Ayodhya Ram temple: అయోధ్యలో శ్రీరాముడి కోవెల నిర్మాణంలో వేగం పెరిగింది. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
Ayodhya Ram temple: అయోధ్యలో శ్రీరాముడి కోవెల నిర్మాణంలో వేగం పెరిగింది. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాగా, ఆలయ నిర్మాణానికి దేశ వ్యాప్తంగా హిందువుల నుంచి విరాళాలు సేకరిస్తామని అయోధ్య రామందిరం ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా తెలంగాణలోనూ అయోధ్య రామమందిరం కోసం విరాళాల సేకరణకు కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రామాలయం కోసం నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేపడతామని ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం రమేష్ వెల్లడించారు.
హన్మకొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రామ జన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం దేశ స్వాభిమానానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేందుకు చాలా మంది దాతలు ముందుకు వచ్చినా.. కొందరితో కాకుండా అందరి భాగస్వామ్యంతో రామాలయం నిర్మాణం జరగాలని భావిస్తున్నామన్నారు. ఈ కారణంగానే దేశ వ్యాప్తంగా విరాళాల సేకరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాగా, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భవగవత్‌లు భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.
Also read:
Fake Reporters: టీవీ9 పేరుతో యువతులను మోసం నకిలీ రిపోర్టర్.. ఆటకట్టించిన పోలీసులు..