Srisailam Temple: శ్రీశైలం మహాక్షేత్రంలో మహా పాపం.. సంక్రాంతి పర్వదినాన ఆంక్షలు బేఖాతరు.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ..

Srisailam Temple: సంక్రాంతి పర్వదినాన శ్రీశైలం మహా క్షేత్రంలో కొందరు వ్యక్తులు మహా పాపానికి ఒడిగట్టారు. నిషేధిత మద్యం, మాంసాహారాన్ని..

Srisailam Temple: శ్రీశైలం మహాక్షేత్రంలో మహా పాపం.. సంక్రాంతి పర్వదినాన ఆంక్షలు బేఖాతరు.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 15, 2021 | 8:42 PM

Srisailam Temple: సంక్రాంతి పర్వదినాన శ్రీశైలం మహా క్షేత్రంలో కొందరు వ్యక్తులు మహా పాపానికి ఒడిగట్టారు. నిషేధిత మద్యం, మాంసాహారాన్ని శ్రీశైల క్షేత్రానికి తీసుకెళ్తూ పట్టుబడ్డారు. వారిని శ్రీశైలం వన్‌టౌన్ పీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనుమ పండుగ సందర్భంగా శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. దాంతోపాటే శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద, టోల్ గేట్ వద్ద పోలీసులు భారీ పహారా ఏర్పాటు చేసిన వాహనానలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో మాంసాహారం, మద్యం పట్టుబడింది. కొందరు పర్యాటకులతో పాటు స్థానికులు సైతం మాంసాహారం, మద్యాన్ని శ్రీశైలానికి తరలిస్తూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

దాదాపు 20 కేజీల మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శ్రీశైలం ఎస్ఐ హరిప్రసాద్, దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరిసింహ రెడ్డి వెల్లడించారు. మద్యం, మాంసంతో పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా, దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం శ్రీశైలం దేవస్థానం పరిధిలో మద్యం, మాంసాహారాలు నిషేధం. అయితే, ఓవైపు శ్రీశైలం క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా.. మరోవైపు కొందరు వ్యక్తులు మద్యం, మాంసాహారాన్ని శ్రీశైలానికి తీసుకురావడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also read:

West Bengal: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి మరో దారి లేదు.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..

Indian Army Chief: భారత్‌లో చొరబడేందుకు 400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు: ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌