Telangana: వైభవంగా తిక్క వీరేశ్వర స్వామి జాతర .. పెంపుడు కుక్కల పరుగు పందెం పోటీలు
తిక్కవీరేశ్వరస్వామి జాతరను పురస్కరించుకొని అయిజలో సంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రైతులతో అనుబంధం ఉన్న పెంపుడు జంతువుల పోటీలు జాతరలో ఆకర్షణగా నిలుస్తుంటాయి.
జోగులంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శ్రీశ్రీశ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెంపుడు కుక్కల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా కుక్కలతో వచ్చిన యజమానులు పోటీలు జరిపించారు. ఈ పోటీల్లో 20కి పైగా శునకాలు పోటీ పడ్డాయి. కుక్కలను పోటీలకు సిద్ధం చేసి రేసింగ్ ట్రాక్‌లో వదిలిపెడతారు. పందులను బరిలోకి దింపి ఫైటింగ్ చేయిస్తారు. ఈ వింత పోటీలను చూసేందుకు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
విజేతలుగా నిలిచిన వాటికి బహుమతులు అందజేశారు. తిక్కవీరేశ్వరస్వామి జాతరను పురస్కరించుకొని అయిజలో సంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రైతులతో అనుబంధం ఉన్న పెంపుడు జంతువుల పోటీలు జాతరలో ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే ఇలాంటి పోటీలు జరుగుతున్నాయి. ఈ సంప్రదాయ పోటీలకు నడిగడ్డ అడ్డాగా మారింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..