Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంటికి వీధిపోటు ఉంటే ఏమవుతుంది.? ఏ దిశలో ఉంటే ఏం జరుగుతుంది.?

మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును బాగా నమ్ముతారు. ఇక వాస్తులో ప్రధానమైన అంశాల్లో వీధిపోటు ఒకటి. వీధిపోటు ఉన్న ఇంటిని కొనుగోలు చేయడానికి చాలా మంది భయపెడుతుంటారు. ఇంటికి ఎదురుగా వీధి ఉండడాన్నే వీధి పోటు అంటారు. కొన్ని దిశల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీధిపోటు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏ దిశలో వీధి పోటు ఉంటే.? ఎలాంటి ఫలితం ఉంటుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: ఇంటికి వీధిపోటు ఉంటే ఏమవుతుంది.? ఏ దిశలో ఉంటే ఏం జరుగుతుంది.?
Veedhi Potu
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 19, 2023 | 11:28 PM

ఇంటిని కొనుగోలు చేయాలన్నా, కొత్త ఇంటిని నిర్మించాలన్నా ప్రతీ ఒక్కరూ వాస్తు చూస్తారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం లేకపోతే ఇంటిని కొనుగోలు కూడా చేయని వారు చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును బాగా నమ్ముతారు. ఇక వాస్తులో ప్రధానమైన అంశాల్లో వీధిపోటు ఒకటి. వీధిపోటు ఉన్న ఇంటిని కొనుగోలు చేయడానికి చాలా మంది భయపెడుతుంటారు. ఇంటికి ఎదురుగా వీధి ఉండడాన్నే వీధి పోటు అంటారు. కొన్ని దిశల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీధిపోటు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏ దిశలో వీధి పోటు ఉంటే.? ఎలాంటి ఫలితం ఉంటుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంటికి దక్షిణం దిశలో వీధి పోటు ఉంటే చాలా ప్రమాదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటి ఇంట్లో ఉన్న మహిళలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వీరికి తరచూ అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని, వివాహాలు ఆలస్యమవుతాయని చెబుతున్నారు. ఇలాంటి ఇంట్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో అకాల మరణం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు రావడం కూడా కష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

* పశ్చిమ నైరుతి పోటు ఉంటే ఆ ఇంట్లో నివసించే మగవారికి మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వృత్తి జీవితంలో ఎదుగుదల ఉండదు. ఉపాధి లభించక ఇబ్బంది పడుతారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాస్తు పరమైన మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఒకవేళ ఇంటికి తూర్పు వీధిపోటు ఉంటే ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

* ఇక ఆగ్నేయంలో వీధిపోటు ఉంటే అనుకోని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఇంట్లో ధనం నిలవదని చెబుతున్నారు. ఎంత సంపాదించిన రూపాయి నిల్వదు అన్న చందంగా పరిస్థితి మారుతుంది.

* నైరుతు దిశలో కూడా వీధి పోటు ఇంట్లో వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నైరుతిలో వీధిపోటు ఉంటే ఇంట్లో వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మానసికంగా కృంగిపోతారు. అనుకొని ఖర్చులు వస్తాయి. ఏ పనిచేసినా కలిసిరాదు.

నోట్‌: పైన తెలిపిన అంశాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించడం జరిగింది. వీటిలో శాస్త్రీయ ఆధారాలకు టీవీ9కి ఎలాంటి బాధ్యత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..