Vastu Tips: ఇంట్లో డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..
డబ్బు ఎంత సంపాదించినా.. కొన్ని సార్లు చేతిలో చెల్లి గవ్వ కూడా ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు కూడా పుట్టవు. దీంతో చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోతే బతకడం చాలా కష్టం. ప్రతీ పనికి డబ్బులో ముడి పడి ఉంటుంది. డబ్బులు ఉంటేనే కడుపు నిండా తినడానికి, ఇతర వస్తువులు, పనులు చేసుకోగలుగుతాం. సమాజంలో గౌరవంగా బతకాలన్నా డబ్బు ఉండాలి. ఇలా ప్రతీ దానికి డబ్బు అనేది చాలా అవసరంగా ఏర్పడింది. డబ్బు ఉంటేనే ఏదన్నా..
డబ్బు ఎంత సంపాదించినా.. కొన్ని సార్లు చేతిలో చెల్లి గవ్వ కూడా ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు కూడా పుట్టవు. దీంతో చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోతే బతకడం చాలా కష్టం. ప్రతీ పనికి డబ్బులో ముడి పడి ఉంటుంది. డబ్బులు ఉంటేనే కడుపు నిండా తినడానికి, ఇతర వస్తువులు, పనులు చేసుకోగలుగుతాం. సమాజంలో గౌరవంగా బతకాలన్నా డబ్బు ఉండాలి. ఇలా ప్రతీ దానికి డబ్బు అనేది చాలా అవసరంగా ఏర్పడింది. డబ్బు ఉంటేనే ఏదన్నా చేయగలం. అందుకే అందరూ డబ్బు సంపాదించాలి అనుకుంటారు. ఈ డబ్బు కోసమే చాలా కష్ట పడుతూ ఉంటారు. ఎంత కష్ట పడినా సరే కొన్ని సమయాల్లో చిల్లి గవ్వ కూడా ఇంట్లో ఉండదు. ఇంట్లో డబ్బు నిలవక పోవడానికి వాస్తు నియమాలు కూడా కారణం అవుతాయి. ఇలాంటి పరిస్థితిలో కొన్ని పనులు చేస్తే ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు.
తులసి ఆరాధన:
తులసి మొక్కను హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధిస్తారు. అనేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇంట్లో డబ్బు నిలవకపోతే రోజూ తులసి మాతను పూజించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనానికి కొదవ ఉండదు.
ఉత్తర దిశను శుభ్రంగా ఉంచుకోవాలి:
చాలా మంది ఇంటిని ఎలా పడితే అలా వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిలవదు. ముఖ్యంగా సంపదకు.. ఉత్తర దిశకు ముడి పడి ఉంటుంది. ఈ దిశను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఇంట్లో ఎక్కువ సేపు నిద్రించకూడదు:
ఇంట్లో ఆడవారైనా.. మగవారైనా ఎక్కువ సేపు నిద్రించ కూడదు. ఇలా నిద్ర పోవడం వల్ల ప్రతికూలతకు దారి తీస్తుందట. ఇలా ఎందుకు చెబుతారో ఎవరికీ అర్థం కాదు. కానీ శాస్త్రాల ప్రకారం ఎక్కువ సేపు నిద్రపోకూడదని అంటూ ఉంటారు.
డబ్బును సరైన దిశలో ఉంచండి:
డబ్బును ముందు గౌరవించండి. చాలా మంది ఇంట్లో డబ్బును ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారు. దీని వలన డబ్బుని అవమానించినట్టు అవుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీ దేవి నివసించదని చెబుతారు.