ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుడు దానం చేయవద్దు..! ఒకవేళ చేస్తే మొత్తం కష్టాలే..
Do Not Donate: దానం గురించి అన్ని మతాలలో గొప్పగా చెబుతారు. సనాతన ధర్మం ప్రకారం.. సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం,
Do Not Donate: దానం గురించి అన్ని మతాలలో గొప్పగా చెబుతారు. సనాతన ధర్మం ప్రకారం.. సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యాగం, కలియుగంలో దానధర్మాలు మాత్రమే మనిషిని కాపాడుతాయని చెప్పారు. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో తోచినంత వరకు దానం చేస్తూ ఉండాలి. అయితే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. దానాలు ఎప్పుడూ భక్తితో, వినయంతో చేయాలి. ఈ విషయాన్ని వీలైనంత వరకు రహస్యంగా ఉంచాలి. రహస్య దానం ఉత్తమ దాన ధర్మంగా పరిగణిస్తారు. దానం చేసి ఏది ఆశించకూడదు. అలాగే కొన్ని వస్తువులను జీవితంలో ఎప్పుడు దానం చేయకూడదు. వాటి గురించి తెలుసుకుందాం.
1. స్టీల్ పాత్రలు ఎప్పుడు దానం చేయకూడదు. ముఖ్యంగా ఇంట్లో వాడిన పాత్రలు దానానికి దూరంగా ఉంచాలి. ఒకవేళ దానం చేస్తే కుటుంబం ఆనందం దూరమవుతుంది.
2. నిరుపేదలకు ఆహారాన్ని అందించండి. ధాన్యాలను దానం చేయండి. కానీ ఎల్లప్పుడూ తాజా ఆహారాన్ని మాత్రమే అందించాలి. చెడిన ఆహారాన్ని ఎవరికీ దానం చేయకూడదు. ఇలా చేస్తే మంచిది కాదు. అవసరమైన వారికి ఆహారాన్ని అందించడం వల్ల జీవితంలో మీకు కలిసి వస్తుంది.
3. అవసరమైన వారికి కాపీలు, పుస్తకాలు, గ్రంథాలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. కానీ ఇవి చెడిపోకుండా ఉండాలి. అదే ఈ దానానికి ఉన్న ప్రాముఖ్యత. దానం చేసేటప్పుడు వ్యక్తి ఉద్దేశ్యం ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండాలి.
4. ప్రజలు తరచుగా శనివారాల్లో నూనెను దానం చేస్తారు. అయితే ఈ నూనె స్వచ్ఛంగా ఉండాలి. మీరు ఇప్పటికే ఉపయోగించిన నూనె దానం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.
5. ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడం మానుకోవాలి. ప్లాస్టిక్ విరాళం వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా కత్తులు, కత్తెరలు, మొదలైన పదునైన వస్తువులను దానం చేయడం వల్ల కుటుంబ సంతోషానికి, శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి వాటిని దానం చేయకూడదు. అవసరమైతే కొనుక్కోవచ్చు.
6. చీపురు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇది ఇంటి నుంచి పేదరికాన్ని తొలగిస్తుంది. కాబట్టి చీపురు ఎవరికీ దానం చేయకూడదు. ఒకవేళ దానం చేస్తే ఆర్థిక నష్టం జరుగుతుంది. దాని వల్ల కుటుంబానికి ఇబ్బందులు ఎదురవుతాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి మాత్రమే ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది.