Diwali: ఈ ఏడాది ఎకో ప్రెండ్లీ దీపావళిని జరుపుకోవాలనుకుంటున్నారా.. అయితే సింపుల్ చిట్కాలు మీ కోసం

ఈసారి పర్యావరణ అనుకూలమైన దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటే.. పర్యావరణానికి హితాన్ని కలిగించే ఎకో పటాకులను ఎంచుకోండి. వీటి వలన మనుషులకే కాదు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. 

Diwali: ఈ ఏడాది ఎకో ప్రెండ్లీ దీపావళిని జరుపుకోవాలనుకుంటున్నారా.. అయితే సింపుల్ చిట్కాలు మీ కోసం
Diwali 2022
Follow us

|

Updated on: Oct 16, 2022 | 2:55 PM

దీపావళి పండుగను దేశమంతటా వైభవంగా జరుపుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా దీపావళిని వివిధ రకాలుగా సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకుంటారు. దీపావళి రోజున ప్రజలు తమ ఇంటిని పెళ్లికూతురులా అలంకరించుకుంటారు. మెరిసే లైట్లు, రంగుల  రంగోలీతో ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. చాలా షాపింగ్ చేస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు. అనంతరం దీపావళి మందులను కాలుస్తారు. అయితే కొన్ని రకాల పటాకులు మన ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తున్నాయి. కనుక ఈసారి పర్యావరణ అనుకూలమైన దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటే.. పర్యావరణానికి హితాన్ని కలిగించే ఎకో పటాకులను ఎంచుకోండి. వీటి వలన మనుషులకే కాదు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.

ఎకో పటాకులు అంటే ఏమిటి? పూల కుండలు, పెన్సిళ్లు, స్పర్క్ల్స్ , చక్రాలు వంటి బాణసంచాను తయారు చేయడానికి CSIR ఉపయోగిస్తుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ క్రాకర్స్ తయారు చేస్తున్నారు. ఈ ఎకో పటాకుల గురించి చెప్పాలంటే.. వాటిలో హానికరమైన రసాయనాలు ఉండవు. వాతావరణ కాలుష్యం తక్కువగా ఉంటుంది.

సాధారణ – గ్రీన్ క్రాకర్స్ మధ్య తేడా ఏమిటి? సాధారణ బాణసంచా తయారీకి గన్‌పౌడర్‌తో పాటు అనేక మండే రసాయనాలను ఉపయోగిస్తారు. వాటిని కాల్చినప్పుడు పేలి భారీ కాలుష్యానికి కారణమవుతాయి. పొటాషియం నైట్రేట్,  కార్బన్ తొలగించి తయారు చేసిన క్రాకర్స్ ను తయారు వినియోగించడం వలన  ఉద్గారాలను 15 నుండి 30% తగ్గించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇంటిని దీపాలతో అలంకరించండి క్రాకర్స్ పేల్చడం ఇష్టం లేకుంటే పర్యావరణ హితాన్ని కలిగించే సాంప్రదాయ పద్ధతుల్లో దీపావళిని కూడా జరుపుకోవచ్చు.ఇంటిని దీపాలతో అలంకరించే సంప్రదాయం పాతదే అయినా నేడు రకరకాల కొవ్వొత్తులను కొనే క్రేజ్ కూడా పెరుగుతోంది. కొవ్వొత్తిలో పెట్రోలియం అనే పదార్థం ఉందని.. ఇది ప్రకృతికి హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మట్టి దీపాలు, LED దీపాలతో దీపావళికి ఇంటికి అందంగా అలంకరించండి.

రంగోలి: ప్రస్తుతం మార్కెట్లలో ప్లాస్టిక్ స్టిక్కర్లతో కూడిన రంగోలీ దొరుకుతోంది. అయితే హానికరం. దీపావళి నాడు రంగోలీని ప్లాస్టిక్ స్టిక్కర్స్ కు బదులు పూలు, బియ్యం లేదా రంగోలి రంగులను ఉపయోగించి చేతితో అందంగా ముగ్గులు వేసుకోవచ్చు. ఇది చాలా అందంగా కనిపిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)