Chilukuru Balaji: ఈ నెల 11 నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు.. పూర్తి వివరాలివే..

తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు(Chilukuru) బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏటా శ్రీరామనవమి(Sri Rama Navami) తరువాత దశమి నుంచి బ్రహ్మోత్సవాలు....

Chilukuru Balaji: ఈ నెల 11 నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు.. పూర్తి వివరాలివే..
Chilukuru Balaji
Follow us

|

Updated on: Apr 03, 2022 | 11:10 AM

తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు(Chilukuru) బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏటా శ్రీరామనవమి(Sri Rama Navami) తరువాత దశమి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ గోపాలకృష్ణస్వామి బ్రహ్మోత్సవాల(Brahmotsavalu) ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఉగాది పర్వదినం సందర్భంగా నిన్న ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని వివరించారు. 11వ తేదీ ఉదయం సెల్వర్‌కుత్తు, సాయంత్రం అంకురార్పణం, 12న ధ్వజారోహణం, సాయంత్రం శేషవాహన సేవ, 13న గోపవాహనం, హనుమంత వాహన సేవలు, 14న సూర్యప్రభ, సాయంత్రం గరుడ వాహన సేవ అనంతరం రాత్రి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో స్వామివారి కల్యాణోత్సవం, 15న వసంతోత్సవం, గజవాహనం, 16న ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ, రాత్రి రథోత్సవం,17న మహాభిషేకం, అశ్వవాహనం, ఆస్థానసేవ, దోప్‌సేవ, పుష్పాంజలి సేవలు, 18న ధ్వజారోహణం, ద్వాదశారాధనం నిర్వహించిన అనంతరం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.

ఉత్సవాలనకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. వేడుకల్లో భక్తులు పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.

Also Read

Late Night Party: మాజీ ఎంపీ కుమార్తె పబ్‌లో లేట్ నైట్ పార్టీ.. పోలీసుల అదుపులో ఆర్ఆర్ఆర్ సింగర్..టాలీవుడ్ ప్రముఖులు, డ్రగ్స్ స్వాధీనం

TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌ 2022 సిలబస్‌ కుదింపు! ఏయే విభాగాల్లో ఏమేమి తొలగించారంటే..

Telangana: ఢిల్లీలో నా సీటు లాగేసుకున్నారు!.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చిరంజీవి చమత్కారం..