AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (03-04-2022): చాలా మంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని ...  మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా..

Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Apr 03, 2022 | 7:21 AM

Share

Horoscope Today (03-04-2022): చాలా మంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని …  మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 3వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలుఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహకారం లభిస్తుంది. .

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన గుర్తింపు అందుకోవడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యమైన పనుల్లో తీవ్ర ఆటంకాలు ఎదుర్కొంటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు లాభదాయకమైన ఫలితాలను పొందుతారు. బంధు, మిత్రుల సహాయం అందిస్తుంది. సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు.  ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక బలంతో చేసే పనులు సత్పలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు కొన్ని వ్యవహారాల్లో దైర్యంగా వ్యవహరించాల్సి ఉంది. చేపట్టిన పనులను పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకోవాలంటే.. అందరినీ కలుపుని వెళ్ళాల్సి ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి శుభాకాలం. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో బుద్ధితో అలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారిని ఒక సమస్య అధికంగా ఇబ్బంది పెడుతుంది. మానసిక ప్రశాంతత కోరవదేలా చేస్తుంది. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆందోళన కలిగించే వార్తను వింటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆయా రంగాల్లోని వారు కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. పనికి తగిన ప్రశంసలను  అందుకుంటారు. సమయానుకూలంగా ముందుకు సాగాల్సి ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. అధికార పరిధి పెరుగుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ కోసం ప్రణాళికబద్దంగా నడుచుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు పట్టుదలతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.  వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలోని వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కలహాలు ఏర్పడే అవకాశం ఉంది  అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

Hyderabad: బంజారాహిల్స్‌లో భారీ రేవ్ పార్టీ.. 150 మంది అరెస్ట్.. పార్టీలో బిగ్‌బాస్ విజేత!..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్