Brahma kamalam: హిమాలయాల్లో కనిపించే దివ్య పుష్పం.. వికసించిన వేళ చూస్తే ఏమౌతుందో తెలుసా..?
స్వచ్ఛతకు ప్రతీకగా కనిపిస్తుంది ఈ పుష్పం. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, హేమకుండ్, తుంగనాథ్ వద్ద మాత్రమే ఈ బ్రహ్మకమలాలు కనిపించేవి. కానీ, ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లలోనూ పెంచుకుంటున్నారు. బ్రహ్మకమలం, దాని అందం, మంగళకరమైన స్వభావం నిజంగా చూడదగిన అరుదైన దృశ్యం.

బ్రహ్మకమలం.. ఇది ఒక ఖగోళ పుష్పంగా పిలుస్తారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే అది కూడా ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. ఈ అనంత విశ్వానికి సృష్టికర్తగా పరిగణించే బ్రహ్మ దైవిక జననానికి సాక్షిగా బ్రహ్మకమలాన్ని పిలుస్తారు. ఈ అరుదైన బ్రహ్మకమలం సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. అది ఉదయానికి వాడిపోతుంది. ఈ పుష్పం అనేక ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
చూసేందుకు ఎంతో అందంగా, పౌర్ణమి చంద్రుడిలా కనిపించే బ్రహ్మకమలం..వికసించిన సమయంలో చూస్తుంటే.. తెలియని ఆధ్యాత్మీకతను కలిగిస్తుంది. స్వచ్ఛతకు ప్రతీకగా కనిపిస్తుంది ఈ పుష్పం. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, హేమకుండ్, తుంగనాథ్ వద్ద మాత్రమే ఈ బ్రహ్మకమలాలు కనిపించేవి. కానీ, ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లలోనూ పెంచుకుంటున్నారు. బ్రహ్మకమలం, దాని అందం, మంగళకరమైన స్వభావం నిజంగా చూడదగిన అరుదైన దృశ్యం.
హిమాలయాలలో బ్రహ్మ కమలం వికసించడాన్ని ఒక వేడుక జరుపుకుంటారు కొన్ని సంఘాలకు చెందిన స్థానికులు. బ్రహ్మ కమలం వికసించే సమయంలో వారు నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారట. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విశ్వాసం ఏమిటంటే.. బ్రహ్మ కమలం వికసించినప్పుడు, ఎవరైతే తమ మనసులోని కోరికలు ఆ పుష్పానికి చెప్పుకుంటారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.
వీడియో ఇక్కడ చూడండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








