AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మష్రూమ్ కాఫీ మస్త్‌ లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..

ఇవి శరీరంలోని తెల్ల రక్త కణాలను సక్రియం చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటం ద్వారా సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మాష్రుమ్ కాఫీలో సాధారణ కాఫీ కంటే తక్కువ కెఫిన్ ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో తక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల రాత్రిపూట మంచి నిద్రకు దారితీస్తుంది.

మష్రూమ్ కాఫీ మస్త్‌ లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే..
Mushroom Coffee
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2025 | 8:31 PM

Share

పుట్టగొడుగు కాఫీ.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మష్రూమ్‌ కాఫీ గురించి వింటే ఆశ్చర్యపోవచ్చు. కానీ వీటితో అనేక ఆరోగ్య లాభాలుంటాయి. ఈ పుట్టగొడుగులతో తయారు చేసిన కాఫీ తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మంచి నిద్ర, ఎక్కువ శక్తి, మెరుగైన దృష్టి, రోగనిరోధక శక్తిని పెంచే ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. పుట్టగొడుగుల కాఫీని సాధారణంగా మీరు కిరాణా దుకాణంలో లభించే వంటకు ఉపయోగించే పుట్టగొడుగుల నుండి కాకుండా, ఔషధ పుట్టగొడుగుల నుండి తయారు చేస్తారు. పుట్టగొడుగుల కాఫీ మిశ్రమాలలో ఉపయోగించే సాధారణ రకాల్లో చాగా, లయన్స్ మేన్, రీషి, కార్డిసెప్స్, కింగ్ ట్రంపెట్, టర్కీ టెయిల్ వంటివి ఎక్కువగా ఉన్నాయి.

ఔషధ పుట్టగొడుగుల నుంచి ఈ కాఫీని తయారు చేస్తారు. పుట్టగొడుగులతో చేసే కాఫీ… విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఆందోళనను తగ్గించడానికి సహాయపడతుందని నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగు కాఫీలో కార్డిసెప్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిజన్ వినియోగాన్ని పెంచుతాయి. అలసట, బలహీనత వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఔషధ పుట్టగొడుగులు రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి తోడ్పడతాయి. దీర్ఘకాలిక వాపు సమస్యలు, గుండె జబ్బుల వంటి సమస్యలను తగ్గిస్తాయి. పుట్ట గొడుగులలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.

చాగా, రీషి వంటి పుట్టగొడుగులలో బీటా-గ్లూకాన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని తెల్ల రక్త కణాలను సక్రియం చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటం ద్వారా సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మాష్రుమ్ కాఫీలో సాధారణ కాఫీ కంటే తక్కువ కెఫిన్ ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో తక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల రాత్రిపూట మంచి నిద్రకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఎంత డబ్బు సంపాదించినా.. నిలవడం లేదా..? ఈ పక్షుల ఫోటోలు ఇంట్లో..
ఎంత డబ్బు సంపాదించినా.. నిలవడం లేదా..? ఈ పక్షుల ఫోటోలు ఇంట్లో..
బ్రాయిలర్ vs నాటు కోడి.. ఇందులో ఏది బెస్ట్..
బ్రాయిలర్ vs నాటు కోడి.. ఇందులో ఏది బెస్ట్..
ట్రాఫిక్ కష్టాలకు టాటా.. బెజవాడ వాసులకు భలే గుడ్ న్యూస్..
ట్రాఫిక్ కష్టాలకు టాటా.. బెజవాడ వాసులకు భలే గుడ్ న్యూస్..
మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?
మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?
చేపల కూర నుంచి నీచు వాసన పోవట్లేదా?.. ఇలా కడిగితే సరి
చేపల కూర నుంచి నీచు వాసన పోవట్లేదా?.. ఇలా కడిగితే సరి
14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు..
14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు..
అయ్యో నా పతి దేవుడ్ని కిడ్నాప్ చేశారంటూ భార్య వర్రీ..
అయ్యో నా పతి దేవుడ్ని కిడ్నాప్ చేశారంటూ భార్య వర్రీ..
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం