AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon Grass Tea : ప్రతిరోజూ ఉదయాన్నే ఈ టీ తాగితే రక్తపోటు తగ్గి గుండెకి చాలా మంచిదట..!

లెమన్ గ్రాస్ టీ మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఉదయాన్నే లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఇది టెన్షన్లను తగ్గించి, మెదడును రిలాక్స్ చేస్తుంది. ఇది తలనొప్పి సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే నిద్రలేమిని దూరం చేస్తుంది. దీన్ని రోజూ రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.

Lemon Grass Tea : ప్రతిరోజూ ఉదయాన్నే ఈ టీ తాగితే రక్తపోటు తగ్గి గుండెకి చాలా మంచిదట..!
Lemongrass Tea
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2025 | 9:15 PM

Share

లెమన్ గ్రాస్ ఒక సూపర్ హెర్బ్. యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఉదయమే టీ గా తీసుకోవటం వల్ల ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల గట్ లో మంచి బ్యాక్టీరియా పరిమాణం పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ టీ ని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ ను నివారిస్తుంది. ప్రతిరోజూ ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే, ప్రేగు కదలిక సాఫీగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోవడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ టీ శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. లెమన్ గ్రాస్ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కీళ్లలో వాపు, నొప్పి తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

లెమన్ గ్రాస్ టీ మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఉదయాన్నే లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఇది టెన్షన్లను తగ్గించి, మెదడును రిలాక్స్ చేస్తుంది. ఇది తలనొప్పి సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే నిద్రలేమిని దూరం చేస్తుంది. ఇక, లెమన్ గ్రాస్‌ టీ తయారీ కోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని వేడి చేయాలి.. ఇప్పుడు లెమన్ గ్రాస్ ఆకులు వేసి కాసేపు మరగనివ్వాలి. టీ రెడీ అయ్యాక వడకట్టాలి. రుచి కోసం కొంత తేనెను యాడ్ చేసుకోవచ్చు. దీన్ని రోజూ రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..