Chanakya Niti: ఏ బంధమైనా నిలబడాలంటే ఏమి చెయ్యాలో చాణక్య చెప్పిన మూడు జల్లెడల కథ
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా పాలక వర్గ సభ్యునిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలను తెలియజేశారు. రాజ్య పాలన, ప్రజల సుఖ..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా పాలక వర్గ సభ్యునిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలను తెలియజేశారు. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరిస్తూ.. చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు. మౌర్యచక్రవర్తికి మంత్రిగా పనిచేసిన ఈ పండితుడు స్త్రీ, పురుషుల మధ్య సంబంధాల గురించే కాదు.. స్నేహితుల మధ్య ఉండాల్సిన నమ్మకం గురించి కూడా తెలిపారు. ఈరోజు బంధాలు నిలబడాలంటే మనిషి చేయాల్సిన పనులు ఏమిటి.. చేయకూడనివి ఏమిటి తెలుసుకుందాం. బంధం గురించి మూడు జల్లెడ్ల పరీక్ష కథద్వారా తెలిపారు చాణుక్యుడు.
ఒక సారి చాణ్యుకుడి దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి , నీకు తెలుసా? నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని, అంటూ ఎంతో ఉత్సాహంగా ఏదో చెప్పబోతున్నాడు. వెంటనే చాణుక్యుడు అతడిని ఆపి, “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు, ఒక్క నిముషం సావధానంగా, నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం. అన్నాడు. దానిని తాను “మూడు జల్లెడ్ల పరీక్ష” అంటాను అని.. అడగటం మొదలు పెట్టాడు.
మొదటి జల్లెడ నిజం
“నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం, ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు. అందుకు ఆ స్నేహితుడు, “లేదు, ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు. “అంటే …నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని, నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.
సరే రెండో జల్లెడ మంచి
” నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?” అని అడిగాడు చాణిక్యుడు. “కాదు” అన్నాడు చాణిక్యుని స్నేహితుడు . “అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు. అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం. సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం”అన్నాడు చాణిక్యుడు.
మూడో జల్లెడ “ఉపయోగం:”
“నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? ” అని చాణిక్యుడు అడిగాడు. “లేదు” అన్నాడు ఆ మిత్రుడు. “అయితే నీవు చెప్పబోయే విషయం *నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు.. నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణిక్యుడు.. ఈ కథలోని మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే.. ఎవరి బంధాలైనా నిలబడతాయి. మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.
Also Read: శుక్రవారం లక్ష్మీదేవిని ఈ స్త్రోత్రంతో స్తుతిస్తే.. దారిద్య బాధల తీరి సుఖసంతోషాలతో ఉంటారట