Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.. ఆఫీసు పనులలో అధిక శ్రమ..

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే

Horoscope Today: ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.. ఆఫీసు పనులలో అధిక శ్రమ..
Horoscope Today
Follow us
uppula Raju

|

Updated on: Aug 21, 2021 | 5:44 AM

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. శనివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఓ సారి చూద్దాం..

మేష రాశి : శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఇతరుల నుంచి బహుమానాలు అందు కుంటారు. దూర ప్రయాణాలను కుదిరితే వాయిదా వేసుకోండి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. ఆదాయం పరవాలేదు. అవసరమైన విషయాలకు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి.

వృషభ రాశి : స్థిరాస్తి వ్యవహారాలు లాభాలను తెస్తాయి. ఒక శుభవార్త వల్ల కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు అనవసరపు విషయాలను వదిలేయండి చదువు మీద శ్రద్ధ పెట్టండి. మీ సామర్థ్యం మీద మీరు ఒక అవగాహనకు రండి. ఆఫీసు పనులను సకాలంలో త్వరత్వరగా పూర్తి చేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభాలను తెస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

మిధున రాశి : వ్యాపారస్థులకు నష్టాల బాధలు తొలగుతాయి. ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యం వహించ వద్దు. కోపతాపాలను వదిలివేయండి. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. పెళ్లికాని వారికి సంబంధం కుదిరే అవకాశం. నిరుద్యోగులకు శుభవార్త కొంతమంది ఉద్యోగులకు ఆఫీస్ టూర్. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి : దేవాలయాల సందర్శన వల్ల మనశ్శాంతి విదేశీ వ్యాపారం చేసే వారు జాగ్రత్తగా పడండి. నిరుద్యోగులు అనవసర విషయాలను వదిలి అధిక శ్రమ పడవలసి ఉంది. సమయం చాలా విలువైనదని గుర్తించండి ఆఫీసులో అదనపు బాధ్యతల వల్ల అధిక శ్రమ. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అనవసరపు ఖర్చులను నివారించండి. అధిక శ్రమ వలన తలనొప్పి.

సింహరాశి : మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పాల వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు. ఆఫీసులో పనులను పెండింగ్ పనుల తో సహా పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు. ఆత్మీయుల నుంచి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ పెద్దల నుంచి బహుమతి అందుకుంటారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజును గడపండి.

కన్యారాశి : ఉద్యోగులకు జీతం పెరుగుదల కొంతమందికి ప్రమోషన్. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆఫీసుకు పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలోని సమస్యల వల్ల మానసిక చికాకు. కావలసిన ధనం చేతికందుతుంది అవసరాలకు ఖర్చు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.

తులారాశి : సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగం మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కొంతమందికి ట్రాన్సఫర్ కొంతమందికి ప్రమోషన్. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. భార్యతో పరుషంగా మాట్లాడకండి ఆమె బాధ పడతారు. ఆదాయం బాగున్నా అనవసరపు దుబారా ఖర్చుల వలన డబ్బుకు ఇబ్బంది.

వృశ్చిక రాశి : ఆఫీసులో తోటి ఉద్యోగులతో పై అధికారులతో వాదోప వాదాలకు దిగకండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ పిల్లలతో ఆనందంగా గడపండి అది మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు. పాజిటివ్ ఆలోచనల వలన రోజంతా ప్రశాంతంగా ఉంటారు.

ధనుస్సు రాశి : వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. మీ తల్లి గారి వైపునుంచి ధన సహాయం లభిస్తుంది. మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాలలో పనిచేస్తున్న వారు తమ లక్ష్యాలను చేరుకోవాలంటే అధిక శ్రమ అవసరం. మీకు ఏ విధంగానూ తగరు అనుకున్న స్నేహాలను వదిలిపెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి : వ్యాపారస్తులకు మిశ్రమ అనుభవాలు. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. పాతబాకీలు వసూలవుతాయి. పాత స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ కోసం కొంత సమయం కేటాయించుకోండి ఫిట్ నెస్ ను మెరుగుపరచుకోండి. కొత్తవి మనసుకు నచ్చిన పనులు చేయండి.

కుంభరాశి : ఆత్మవిశ్వాసము తెలివితేటలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను మీరే తీసుకోండి. ఆఫీసులో పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ అవసరాలకు మించిన డబ్బు లభిస్తుంది. స్టాక్ మార్కెట్ లలో లాభాలు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.

మీనరాశి : ధైర్యము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఇంతకు ముందు ఇచ్చిన అప్పును తీర్చకుండా మరల అప్పు అడిగే స్నేహితులను వదిలివేయండి. ఆఫీసు పనులలో మీ శక్తి సామర్థ్యాలపై అందరూ ప్రశంసలు కురిపిస్తారు ఇది మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులు ఒక శుభవార్త అందుకుంటారు.

పవన్ భార్యపై విమర్శలు.. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి
పవన్ భార్యపై విమర్శలు.. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి
బట్టలిప్పి నా ముందు నిలుచో.. హీరోయిన్‌కు స్టార్‌ హీరో వేధింపులు
బట్టలిప్పి నా ముందు నిలుచో.. హీరోయిన్‌కు స్టార్‌ హీరో వేధింపులు
30 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. వరుడి వయసెంతో తెలుసా ??
30 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. వరుడి వయసెంతో తెలుసా ??
ఆ హీరోకు అనుపమ లిప్‌ కిస్! లీకైన ఫోటోతో.. క్రేజీ టాక్
ఆ హీరోకు అనుపమ లిప్‌ కిస్! లీకైన ఫోటోతో.. క్రేజీ టాక్
ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి..
ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి..
మూడేళ్లుగా ప్రతి రోజూ నెలసరి.. కారణం తెలిసి ఖంగుతిన్న వైద్యులు
మూడేళ్లుగా ప్రతి రోజూ నెలసరి.. కారణం తెలిసి ఖంగుతిన్న వైద్యులు
డిజిటల్‌ ఆధార్‌ వచ్చేసింది.. ఇక నో కార్డ్‌.. నో జిరాక్స్‌
డిజిటల్‌ ఆధార్‌ వచ్చేసింది.. ఇక నో కార్డ్‌.. నో జిరాక్స్‌
రైల్లో ప్రయాణికుల నుంచి ఫోన్‌ కొట్టేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
రైల్లో ప్రయాణికుల నుంచి ఫోన్‌ కొట్టేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
బురదలో సేదతీరుతున్న దున్నపోతు.. వీపుపై తట్టిలేపిన సింహం
బురదలో సేదతీరుతున్న దున్నపోతు.. వీపుపై తట్టిలేపిన సింహం
ఇకపై మీ ఇంటికే పెట్రోల్.. బంకుల దగ్గర క్యూ అక్కర్లేదు..
ఇకపై మీ ఇంటికే పెట్రోల్.. బంకుల దగ్గర క్యూ అక్కర్లేదు..