Chanakya Niti: ఈ ఐదు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే సమస్తం కోల్పోవాల్సిందే..!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గుర్తించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితంలో విజయ సాధించడానికి పాటించాల్సిన సూత్రాలు..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గుర్తించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితంలో విజయ సాధించడానికి పాటించాల్సిన సూత్రాలు, పయనించాల్సిన మార్గాలను ఉపదేశించిన మహా గురువు. అపర చాణక్యుడు. జీవితానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని మార్గనిర్దేశం చేసిన ఘనాపాటి. జీవితంలో కష్టాలపాలవకుండా.. ఎవరితో ఎలా మెలగాలి? ఎవరిని విశ్వసించాలి? ఎవరిని విశ్వసించకూడదు? ప్రకృతితో సైతం ఎలా ఉండాలి? అనే అంశాలన్నింటినీ కూలంకశంగా వివరించిన మేధావి చాణక్యుడు. ఆయన రాసిన నీతిశాస్త్రం నాడు, నేడు, రేపటి తరం వారికి కూడా ఉపయుక్తం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నీతిశాస్త్రంలోనే ఒక వ్యక్తి 5 అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరి ఈ ఐదు అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఆచార్య చాణక్య ప్రకారం.. అప్పుడప్పుడూ వచ్చిపోయే వరదలకు ఉప్పొంగే నదులను, వంతెనలు సైతం తట్టుకోలేని నదులను ఎప్పుడూ విశ్వసించకూడదు. ఇలాంటి నదులపై ఉన్న వంతెనల పట్ల జాగ్రత్త తప్పనిసరి. నదీ ప్రవాహం ఎప్పుడు వేగంగా మారుతుందో తెలియదు. వీటిని విశ్వసించి ప్రయాణిస్తే.. జీవితమే సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.
2. ఆయుధాలు కలిగిన వారిని నమ్మకూడదు. అలాంటి వ్యక్తులకు కోపం వస్తే.. ఏం చేస్తారో ఊహించడం కూడా కష్టం. ఆయుధాలు చేతపట్టిన వారి ఎదుట మీరు ఉండి.. వారికి కోపం వస్తే అటాక్ చేసే ప్రమాదం ఉంది. తేడా వస్తే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అందుకే ఆయుధాలు చేతపట్టిన వారికి దూరండగా ఉండటం ఉత్తమం. అలాగే అలాంటి వారిని గుడ్డిగా విశ్వసించడం కూడా పొరపాటే.
3. పెద్ద గోర్లు, కొమ్ములు కలిగిన జంతులను కూడా విశ్వసించొద్దు. అవి ఎప్పుడు అటాక్ చేస్తాయో చెప్పలేం. అవి అటాక్ చేస్తే తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది. తేడా వస్తే చంపేసినా చంపేస్తాయి. అందుకని, అలాంటి జంతువులకు దూరంగా ఉండాలి.
4. చంచల స్వభావం గల స్త్రీలను నమ్మడం కూడా అవివేకమే. వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇలాంటి వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి రావొచ్చు. ఇది మిమ్మల్ని కష్టాలపాలు చేయొచ్చు.
5. ఉన్నత కులస్థులను(రాజవంశస్థులు) గుడ్డిగా విశ్వసించకూడదని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు.. వీరిలో కొందరు వ్యక్తులు తమ అధికారం కోసం ఎవరినైనా ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అవసరం కోసం ఎవరినైనా చేరదీస్తారు.. వదిలేస్తారు. ఇలాంటి వారిని విశ్వసించి ఇబ్బందిపాలు అవ్వొద్దు అని హితవు చెప్పారు.