AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మనిషిలో ఈ మూడు చెడు గుణాలుంటే.. జీవితంలో సంతోషం ఉండదంటున్న చాణక్య

చాణక్యుడు తన నీతి గ్రంథంలో మనిషిలోని  లోపాలను కూడా పేర్కొన్నాడు. వ్యక్తి అభివృద్ధికి ఆటంకాలుగా మారడమే.. ఎంతటి తెలివి గలవారినైనా ఇబ్బంది పెట్టగల మూడు    దుర్గుణాలు ఉన్నాయని. వీటిని దూరం చేసుకున్న మనిషి ఎల్లపుడూ సంతోషముగా జీవిస్తాడని.. పేర్కొన్నాడు

Chanakya Niti: మనిషిలో ఈ మూడు చెడు గుణాలుంటే.. జీవితంలో సంతోషం ఉండదంటున్న చాణక్య
Chanakya Niti
Surya Kala
|

Updated on: Jan 13, 2023 | 12:12 PM

Share

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. రాజనీతి తెలిసిన వ్యక్తి. చాణుక్యుడు చెప్పిన మాటలు నేటికీ అనుసరించదగినవిగా  పరిగణించబడుతున్నాయి. భారతదేశపు గొప్ప రాజకీయ నాయకుడైన చాణక్య తన తెలివితేటలతో ప్రపంచం మొత్తంలో విభిన్నమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చాణక్యుడు చెప్పిన విషయాలు నేటి ప్రజలు పాటించవచ్చు.  వాటిని తమ జీవితాల్లో అన్వయించుకుని జీవింతంలో ముందుకు సాగాల్సి ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలన్నా.. మంచి మార్గం లో నడవాలన్నా సుఖ సంతోషాలతో ఉండాలన్నా చాణక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన అనేక అంశాలు అనుసరణీయం. చాణక్యుడు తన నీతి గ్రంథంలో మనిషిలోని  లోపాలను కూడా పేర్కొన్నాడు. వ్యక్తి అభివృద్ధికి ఆటంకాలుగా మారడమే.. ఎంతటి తెలివి గలవారినైనా ఇబ్బంది పెట్టగల మూడు    దుర్గుణాలు ఉన్నాయని. వీటిని దూరం చేసుకున్న మనిషి ఎల్లపుడూ సంతోషముగా జీవిస్తాడని.. పేర్కొన్నాడు. ఈరోజు మనిషిలో మూడు చెడు గుణాలు ఏమిటో తెలుసుకుందాం..

అహం అహంకారం లేదా నేను గొప్ప అనే భావంతో జీవించే వ్యక్తి తాను కూర్చున్న చెట్టు కొమ్మని తానే గొడ్డలితో కొట్టుకుంటాడని చాణక్య విధానం చెబుతోంది. అహంకారంలో మునిగి తేలే వ్యక్తి ఎప్పుడూ కోపంగా ఉంటాడని, అతను తనను తాను అందరికంటే ఎక్కువ అని  భావిస్తాడని చాణక్యుడు చెప్పాడు. చాణక్య విధానం ప్రకారం, పదవి, డబ్బు వంటి సౌకర్యాలు ఈ రోజు ఉంటాయి.. రేపు పోతాయి. వాటి మత్తులో మునిగే వ్యక్తి.. ఈ మత్తులోంచి బయటికి రాగానే పూర్తిగా నాశనమైపోతాడు.

దురాశ మనమందరం జీవితంలో సంతోషం,  సౌకర్యాల కోసం డబ్బు సంపాదించాలి. అంతేకాని డబ్బు సంపాదనే ధ్యేయంగా తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు వ్యర్థాన్ని మాత్రమే ఇస్తుంది. దురాశ ఒక పెద్ద లోపం. క్షణాల్లో జరిగే అభివృద్ధి..  భవిష్యత్తును పాడు చేసుకోవడనికి మార్గం అని అంటారు చాణక్యుడు.

ఇవి కూడా చదవండి

అబద్ధం చెప్పే అలవాటు  అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న వ్యక్తి ఏదో ఒక రోజు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. ప్రజలు తమ స్వలాభం కోసం అబద్ధాలు చెప్పడం వంటి లోపాలను అలవర్చుకుంటారు. మొదట్లో అంతా బాగానే అనిపించినా నిజం తెరపైకి వచ్చేసరికి ఆ వ్యక్తి పరిస్థితి చాలా దారుణంగా దిగజారుతుంది. కనుక అబద్ధం చెప్పే అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..