Zodiac sign: కుంభరాశిలో శుక్రుడి సంచారం.. 2023లో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే. మీ రాశి ఉందేమో చూసుకోండి.
2023లో గ్రహాల్లో అనేక కీలక మార్పులు జరగనున్నాయి. ప్రధాన గ్రహాల రాశిచక్ర మార్పులపరంగా 2023 సంవత్సరం ముఖ్యమైంది. గ్రహాల రాశిలో భారీగా మార్పు ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత శని గ్రహం తన సొంత గ్రహమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తోంది. దీతో చాలా మంది జీవితాల్లో స్పష్టమైన మార్పులు..

2023లో గ్రహాల్లో అనేక కీలక మార్పులు జరగనున్నాయి. ప్రధాన గ్రహాల రాశిచక్ర మార్పులపరంగా 2023 సంవత్సరం ముఖ్యమైంది. గ్రహాల రాశిలో భారీగా మార్పు ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత శని గ్రహం తన సొంత గ్రహమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తోంది. దీతో చాలా మంది జీవితాల్లో స్పష్టమైన మార్పులు రానున్నాయి. ఇక ఐశ్యర్యానికి పెట్టింది పేరైన శుక్రుడు జనవరి 22వ తేదీన కుంభరాశిలో సంచరించబోతున్నాడు. కుంభంలో శుక్రుడి సంచారం వల్ల ప్రధానంగా మూడు రాశులకు అదృష్టం వరించనుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటి.? ఈ మార్పులు వల్ల జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* వృషభ రాశి వారికి లగ్నంతో పాటు 6వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగంపై ప్రభావం పడుతుంది. వృషభ రాశి వారికి ఈ ఏడాది ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలోనూ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు కొత్త ఉద్యోగం చేసే అవకాశం ఉంది. వాహన ప్రాప్తి పొందే చాన్సెన్స్ ఉన్నాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం మీద ఈ ఏడాది వృషభ రాశి వారికి ఢోకా ఉండదు.
* కుంభ రాశి వారికి ఈ ఏడాది మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఏలిన నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ.. శుక్రుడు లగ్నము నుంచి ఈ రాశిలో సంచరించడం ద్వారా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహానికి గత కొన్ని రోజులుగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభించానలుకునే వారికి మంచి సమయంగా చెప్పొచ్చు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి.
* శుక్రుడి స్థాన చలనం కారణంగా తులారాశి వారి జీవితంలో మార్పులు జరగనున్నాయి. తుల రాశి ఎనిమిదవ, లగ్న ఇంటికి శుక్రుడు అధిపతి. శుక్రుని సంచారం కారణంగా ఈ రాశు వారు వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్ధతు లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..