Vidur Niti: జీవితంలో ఈ 4 అంశాలను అస్సలు విస్మరించొద్దు.. తప్పక విజయాన్నిస్తాయి..
Vidur Niti: చాణక్య నీతి ఎంత ప్రసిద్ధో.. విధుర్ నీతి కూడా అంతే ప్రసిద్ధి. జీవితానికి సంబంధించి విధురుడు ఎన్నో కీలక విషయాలు చెప్పారు. మహాభారతంలోని ప్రముఖ పాత్రలలో ఒకరైన విధురుడు అత్యంత తెలివైన,

చాణక్య నీతి ఎంత ప్రసిద్ధో.. విధుర్ నీతి కూడా అంతే ప్రసిద్ధి. జీవితానికి సంబంధించి విధురుడు ఎన్నో కీలక విషయాలు చెప్పారు. మహాభారతంలోని ప్రముఖ పాత్రలలో ఒకరైన విధురుడు అత్యంత తెలివైన, నైపుణ్యాలు కలిగిన రాజకీయ, దౌత్యవేత్తగా వెలుగొందారు. విధురుడు చెప్పిన అనేక విషయాలు నేటికీ అనుసరనీయమే. మహారాజ ధృతరాష్ట్రునితో సంభాషణలో భాగంగా అనేక వివరాలను ఇద్దరూ చర్చించారు. ఆ సంభాషణలోని విషయాలు విధుర్ నీతిలో పేర్కొనడం జరిగింది. ఈ విధుర్ నీతిలో ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన నాలుగు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుంటే.. జీవితంలో ఎప్పుడూ వైఫల్యాన్ని ఎదుర్కోరని విధురుడు చెప్పారు. మరి ఆ అంశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జీవితంలో ఈ 4 విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి..
1. డబ్బుపై వ్యామోహం వద్దు: ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అయితే, కొందరు డబ్బు సంపాదన కసం విపరీతంగా కష్టపడుతూ.. మనసులో ఏడ్చుకుంటూ డబ్బు సంపాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అది వారిని మరింత క్షీణింపజేస్తుంది. డబ్బుపై వ్యామోహం ఏమాత్రం సరికాదు. ఈ విధంగా డబ్బు సంపాదించాలనే కోరికను వదిలిపెట్టాలని విధురుడు పేర్కొన్నారు.
2. వారిని అస్సలు నమ్మొద్దు: అవసరానికి తగ్గట్లు అడుగులు వేసే వారిని అస్సలు నమ్మొద్దు. జీవితంలో ఇలాంటి వారిని అస్సలు దగ్గరకు రానీయొద్దు. వీరు ఎవరికీ బంధువులు కాలేరు. ఇలాంటి వారు తమ స్వలాభం కోసం ఎవరినైనా మోసం చేస్తారు. అందుకే ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.




3. అబద్ధాలతో బంధం వద్దు: విధుర్ నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తులెవరు కూడా అబద్ధాలు చెప్పి సంబంధాలను ఏర్పరుచుకోరు. ఎందుకంటే.. వారి అవసరం కోసం వారు మీ వద్దకు వస్తారు. అబద్ధాలు చెప్పడం ద్వారా వారి అవసరాలు తీర్చుకుంటారు. సమయం వచ్చినప్పుడు దెబ్బతీస్తారు.
4. ఇతరుల విజయాలను సంతోషించని వారికి దూరంగా ఉండాలి: విధుర్ నీతి ప్రకారం.. ఇతరుల విజయాన్ని చూసి సంతోషించని వారి నుంచి ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఇలాంటి వారు ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేయగలరు. జీవితంలో ఎదుటి వారిపై అసూయపడే బదులు.. మీ గురించి మీరు తెలుసుకోవడం ఉత్తమం. మీ పొరపాట్లు ఏంటో గుర్తించి, దానిని సరిచేసుకుంటే మంచిది. ఇది మీరు మీ జీవితంలో విజయం సాధించడంలో సహకరిస్తుంది.
మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..