Andhra pradesh: పండగ షాపింగ్ లో భోగి పిడకలు.. భలే గిరాకీ.. ఎక్కడ అమ్ముతున్నారో తెలుసా..?
భోగి పిడకలు కాలిపోయాక బూడిదను విభూతిగా నుదుటిన పెట్టుకుంటారు. నేటి కాంక్రీట్ జంగిల్ కల్చర్ లో బోగి పిడకలు కరవవుతున్నాయి. అందువల్లే భజరంగ్ దళ్.. భోగి పిడకల అమ్మకాలు చేస్తోంది.
సంక్రాంతి పండగ భోగిమంటలతోనే మొదలవుతుంది. సంక్రాంతి రోజున మన తెలుగు రాష్ట్రాల్లో ఊరూ వాడా.. భోగి మంటలు వేసి.. సందడి చేస్తారు. అయితే ఈ భోగి మంటల్లో.. ఆవు పేడలతో చేసే పిడకలు అత్యంత కీలకం. సిటీ కల్చర్ లో ఈ పిడకలు దొరికే అవకాశమే లేదు. వాటిని తయారు చేసి, అమ్మే వారు బాగా అరుదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళంలో మాత్రం.. ఈ ఆవుపేడతో పిడకలను చేసి అమ్ముతున్నారు భజరంగ్ దళ్ వారు. దీంతో వీటికి భలే డిమాండ్ ఏర్పడింది. కొన్ని వందల ఆవు పిడకలను ఇప్పటి వరకూ తాము అమ్మ గలిగామని అంటున్నారు అమ్మకందార్లు.
అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను తిరిగి పరిచయం చేసే ఉద్దేశంతో.. శ్రీకాకుళం జి.టి. రోడ్లో భజరంగ్ దళ్ ఈ భోగి పిడకలను అమ్ముతోంది. భోగి మంటల్లో పిడకలు వేయటం మన సంప్రదాయం. భోగి పిడకలు కాలిపోయాక బూడిదను విభూతిగా నుదుటిన పెట్టుకుంటారు. నేటి కాంక్రీట్ జంగిల్ కల్చర్ లో బోగి పిడకలు కరవవుతున్నాయి. అందువల్లే భజరంగ్ దళ్.. భోగి పిడకల అమ్మకాలు చేస్తోంది. ఈ పిడకలను కొనడానికి మహిళలు సైతం ఎంతో ఉత్సాహం చూపుతున్నారు.
మాములుగా సిటీ కల్చర్ లో.. భోగి అనగానే ఇంట్లో ఉండే పాత సామాన్లు మంటల్లో వేసి.. భోగి పీడ విరగడైందని భావిస్తుంటారు. కానీ సంప్రదాయ భోగి మంటలను ఆవు పిడకలతో వేయడం ఆరోగ్యదాయకంగా చెబుతారు మన పండితులు. అందులో భాగంగానే తామీ ఆవు పిడకలను అమ్ముతున్నట్టు చెబుతున్నారు భజరంగ్ దళ్ కార్యకర్తలు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..