Sankranti 2023: గుడ్ లక్ కోసం సంక్రాంతి రోజున ఏ రాశివారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి.. దానం చేయాలంటే..
మకర సంక్రాంతి నాడు ఎవరైతే తన రాశి ప్రకారం సూర్య భగవానుని పూజిస్తారో.. స్నానం చేస్తారో, దానం చేస్తారో వారి జీవితం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. ఈ మకర సంక్రాంతి నాడు ఏ రాశి వ్యక్తులు ఏయే విరాళాలు ఇస్తే శుభప్రదం అవుతుందో ఈరోజు తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుని సంచారాన్ని సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు. ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. వీటిల్లో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే మకర సంక్రాంతి విశిష్టమైంది. మకర సంక్రాంతి పండుగను హిందూ మతంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి నాడు సూర్యభగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించనున్నాడు. దీంతో శుభ సమయం మొదలవుతుంది. అన్ని రకాల శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతి నాడు ఎవరైతే తన రాశి ప్రకారం సూర్య భగవానుని పూజిస్తారో.. స్నానం చేస్తారో, దానం చేస్తారో వారి జీవితం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. ఈ మకర సంక్రాంతి నాడు ఏ రాశి వ్యక్తులు ఏయే విరాళాలు ఇస్తే శుభప్రదం అవుతుందో ఈరోజు తెలుసుకుందాం..
మేషం, వృశ్చిక రాశులు: ధరణి పుత్రుడు కుజుడు .. మేష, వృశ్చిక రాశులకు అధినేత. అటువంటి పరిస్థితిలో.. ఈ రెండు రాశులపై అంగారకుడు ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో.. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం చేసిన తర్వాత నువ్వులు, బెల్లం, కిచడీ, పప్పు, పాయసం, ఎరుపు లేదా గులాబీ రంగు ఉన్ని బట్టలు మొదలైన వాటిని దానం చేయడం శ్రేయస్కరం.
వృషభం, తులా రాశులు: వృషభం, తులారాశులకు అధిపతి శుక్రుడు. జ్యోతిషశాస్త్రంలో.. శుక్ర గ్రహం ఆనంద కారకం. కీర్తి, సుఖ సంతోషాలను అందించే గ్రహం శుక్రుడు పరిగణింపబడుతున్నారు. మకర సంక్రాంతి నాడు పంచదార, అన్నం, పాలు-పెరుగు, తెలుపు లేదా గులాబీ రంగు ఉన్ని దుస్తులు, కిచడీ, నువ్వులు-బెల్లం దానం చేయడం వల్ల జాతకంలో శుక్రుడు బలపడతాడు.
మిథున, కన్య రాశులు: బుధుడు మిథున, కన్యారాశులకు అధిపతి. అటువంటి పరిస్థితిలో.. జాతకంలో బుధ గ్రహం బలపడటానికి.. మకర సంక్రాంతి నాడు స్నానం చేసిన తర్వాత శనగ పప్పు, కిచడి, వేరుశెనగలు, బట్టలు మొదలైనవి దానం ఇవ్వడం శుభప్రదం.
కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కనుక మకర సంక్రాంతి రోజున ఖీర్, నువ్వుల లడ్డూలు, మిఠాయిలు, కిచడీలు వంటివి దానం చేయడం వల్ల చంద్రుడు ప్రసన్నం అవుతాడు.
సింహరాశి : జ్యోతిషశాస్త్రం ప్రకారం సింహ రాశికి సూర్యుడు అధిపతి. అటువంటి పరిస్థితిలో, సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి మకర సంక్రాంతి నాడు సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించి గంగానదిలో స్నానం చేసి కిచడీ, ఎర్రటి వస్త్రం, బెల్లం, పప్పు మొదలైన వాటిని దానం చేయడం శుభప్రదం.
ధనుస్సు , మీన రాశి: ధనుస్సు , మీన రాశులకు బృహస్పతి అధిపతి. ఈ రాశి వారు మకర సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం, కిచడి, శనగపప్పు, బొప్పాయి, పసుపు చందనం వంటివి దానం చేస్తే శుభం కలుగుతుంది.
మకర, కుంభ రాశులు: కుంభ, మకర రాశులకు శశనీశ్వరుడు అధిపతి. మకర సంక్రాంతి నాడు శనిదోషం తొలగిపోయి శనిగ్రహ అనుగ్రహం కలగాలంటే.. కిచిడి, నల్ల గొడుగు, నువ్వులు లేదా ఆవనూనె, ఉన్ని దుస్తులు బట్టలను అవసరమైన వారికి దానం చేయాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)