AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Record : అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. టీ20 క్రికెట్‌లో ఫిన్ అలెన్ సరికొత్త ప్రపంచ రికార్డు

World Record : టీ20 క్రికెట్ ప్రపంచంలో రికార్డుల వేట కొనసాగుతోంది. నేటి తరం బ్యాటర్లు బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో పాత రికార్డులు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. తాజాగా టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ పేరిట ఉన్న ఒక అరుదైన ప్రపంచ రికార్డును న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ ఫిన్ అలెన్ బద్దలు కొట్టారు.

World Record : అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. టీ20 క్రికెట్‌లో ఫిన్ అలెన్ సరికొత్త ప్రపంచ రికార్డు
Finn Allen
Rakesh
|

Updated on: Feb 11, 2026 | 9:46 AM

Share

World Record : టీ20 క్రికెట్ ప్రపంచంలో రికార్డుల వేట కొనసాగుతోంది. నేటి తరం బ్యాటర్లు బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో పాత రికార్డులు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. తాజాగా టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ పేరిట ఉన్న ఒక అరుదైన ప్రపంచ రికార్డును న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ ఫిన్ అలెన్ బద్దలు కొట్టారు. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా ఫిన్ అలెన్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 5000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇప్పటివరకు భారత ఆటగాడు అభిషేక్ శర్మ పేరిట ఉండేది. అభిషేక్ కేవలం 2898 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకుని, వెస్టిండీస్ దిగ్గజం ఆండ్రీ రసెల్ (2942 బంతులు) రికార్డును అధిగమించాడు. అయితే, ఫిన్ అలెన్ ఇప్పుడు అభిషేక్ కంటే 44 బంతులు తక్కువగానే, అంటే కేవలం 2854 బంతుల్లోనే 5000 పరుగుల మార్కును దాటి ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 10న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు యూఏఈని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్ మరియు టిమ్ సైఫర్ట్ బౌలర్లను ఉతికి ఆరేశారు. కేవలం 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించారు. టిమ్ సైఫర్ట్ 42 బంతుల్లో 89 పరుగులు చేయగా, ఫిన్ అలెన్ 50 బంతుల్లో 84 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచారు. ఈ ఇన్నింగ్స్ 21వ బంతికి అలెన్ తన 5000 పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం.

యూఏఈ మ్యాచ్‌కు ముందు ఫిన్ అలెన్ 5000 పరుగులకు 38 పరుగుల దూరంలో ఉన్నారు. తన వినాశకరమైన బ్యాటింగ్‌తో కేవలం 21 బంతుల్లోనే ఆ 38 పరుగులు పూర్తి చేసి రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో 5046 పరుగులు ఉన్నాయి. ఫిన్ అలెన్ స్ట్రైక్ రేట్ టీ20 క్రికెట్‌లో దాదాపు 170కి పైగా ఉండటం ఆయన దూకుడుకు నిదర్శనం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..