Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది. రుతువపనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఏ స్టేట్‌లో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడురోజుల వాతావరణ ఎలా ఉండబోతుందోనని వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. నైరుతి రుతుపవనాల ఉత్తర సరిహద్దు ప్రస్తుతం హర్నై, సోలాపూర్, హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, ఫుల్‌బాని, రాంచీ, జముయి, ముజఫర్‌పూర్ మీదుగా కొనసాగుతోందని.. ఇవి రాబోయే 4-5 రోజులలో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.
వర్షం, వడగాలుల హెచ్చరిక
అలాగే తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం అదే ప్రాంతంలో మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పస్టం చేసింది. అలాగే వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీస్తాయని తెలిపింది. మరోవైపు ఉండగా ఉత్తర తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో రాగల మూడు రోజుల్లో వడగాల్పుల కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా
అటు ఏపీ వాసులకు కూడా వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని దీని ప్రాభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం ఇలా
ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుముల, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షం సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగముతో ఈదురు గాలుఉ కూడా వీచే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో వేడి, తే తో కూడిన వాతావరణము ఏర్పడే అవకాశముందని స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
