Chanakya Niti: చాణుక్యుడు చెప్పిన ఈ విధానాలు పాటిస్తే.. సమాజంలో గౌరవం, డబ్బు మీ సొంతం..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. ఈ నీతి శాస్త్రంలో సమాజంలోని దాదాపు ప్రతి అంశానికి సంబంధించిన..

Chanakya Niti: చాణుక్యుడు చెప్పిన ఈ విధానాలు పాటిస్తే.. సమాజంలో గౌరవం, డబ్బు మీ సొంతం..
ChanakyaImage Credit source: Chanakya
Follow us
Surya Kala

|

Updated on: Mar 06, 2022 | 9:47 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. ఈ నీతి శాస్త్రంలో సమాజంలోని దాదాపు ప్రతి అంశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలతో పాటు..  ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు చాణుక్యుడు తెలిపాడు. తన జీవితానుభవంతో ఆచార్య చెప్పిన విషయాలను ప్రస్తుత సమాజంలో నేటి జనరేషన్ కు అనుసరణీయని పెద్దలు చెప్పారు. అలా చాణుక్యుడు చెప్పిన విషయాలను పాటిస్తే.. ఎంతటి కష్టమైనా తేలికగా నివారించుకోవచ్చు.  ఈరోజు మనిషి ధనవంతులు కావాలంటే ఏమి చేయాలి.. ఏ విధంగా డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టాలి చెప్పిన విషయాల గురించి తెల్సుకుందాం..

  1. మనిషి ఎప్పుడైనా కష్టాలు ఎదురైనప్పుడు ఆదుకునే నిజమైన స్నేహితుడు డబ్బు అని చాణక్య నీతి చెబుతుంది. కనుక డబ్బులను ఎల్లప్పుడూ చేతిలో ఉంచుకోండి. డబ్బు జీవితాన్ని సులభతరం చేయడమే కాదు.. సమాజంలో గౌరవాన్ని కూడా తెస్తుంది. కనుక డబ్బుని వృధాగా ఖర్చు చేయవద్దు.. అవసరమైన చోట ఎంతమేరకు అవసరమో అంత వరకూ మాత్రమే ఖర్చు చేయండి.
  2. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోకూడదనుకుంటే.. ఆదాయాకి తగిన విధంగా ఖర్చులు పెట్టాలి. ఆదాయానికి మించి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవద్దు. అనవసర విషయాలలో డబ్బును వృధా చేసే వారు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
  3. ఎవరిదగ్గరైనా అవసరానికి మించి డబ్బు ఉంటే, దానిని పొదుపు చేయకండి.. డబ్బును భూమి, బంగారం మొదలైన వాటిపై పెట్టుబడిగా పెట్టండి. ఆపద వచ్చినప్పుడు, డబ్బులు కావాల్సిన వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, పెట్టుబడి పెట్టబడిన ఈ డబ్బు అక్కరకు వస్తుంది.
  4. సంక్షేమ పనుల కోసం డబ్బులను ఖర్చు చేయాలి. ముఖ్యంగా పేదలకు, రోగులకు సహాయం చేయండి.  అంతేకాదు  ఆలయాల కోసం లేదా మతపరమైన స్థలంలో విరాళం ఇవ్వండి. ఇది జీవితంలో సానుకూలతను తెస్తుంది. అంతేకాదు  భగవంతుని అనుగ్రహాన్ని ఇస్తుంది.
  5. డబ్బుకు లోటు లేనివారు సామాజిక సేవ చేయడం వలన మేలు జరుగుతుంది. ఆసుపత్రులు, పాఠశాలలు, తాగునీరు వంటి కనీస అవసరాలను ప్రజలకు ఏర్పాటు చేయడం ద్వారా అది మీ ప్రతిష్టను పెంచుతుంది. మీకు అదృష్టాన్ని తెస్తుంది.

Also Read:

స్కూల్‌కు వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు.. నగరంలో ఇద్దరు బాలికల అదృశ్యం.. అసలేం జరిగింది?