AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (06-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుందని ...  మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Mar 06, 2022 | 6:29 AM

Share

Horoscope Today (06-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుందని …  మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 6వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. స్థిర నిర్ణయాలను తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ప్రతిఫలాన్ని అందుకుంటారు. చేపట్టిన పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కీలక వ్యవహారాలలో ముందుకు వెళ్లాలంటే నిర్లక్ష్యాన్ని వీడండి.  కొన్ని పరిస్థితులు ఈ రాశివారికి నిరుత్సాహపరుస్తాయి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధుమిత్రులను కలిసి ఆనందంగా కలుస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి.  అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. మానసిక బలంతో చేపట్టిన పనుల్లో ఫలితాలను అందుకోవాల్సి ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభించేలా కష్టపడాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. అభివృద్ధి పనుల గురించి ఆలోచిస్తారు. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అందరిని కలుపుకుని పోవడం వలన మంచిది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే  సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమయానికి తగిన నిద్రాహారాలు అవసరం

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కీలక విషయాల్లో తగిన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు సంతోషకరమైన వార్త వింటారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. ఆత్మీయుల నుంచి ప్రేమాభిమానాలు అందుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయుల ప్రేమాభిమానులను సొంతం చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా శుభ ఫలితాలు అందుకుంటారు. కీలక పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు డబ్బులు ఖర్చు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే సత్పలితాలు అందుకుంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారువృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాలను అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

అంగరంగ వైభవంగా.. జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా గరుడ వాహన సేవ.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?