Chanakya Niti: జీవితంలో సక్సెస్, సుఖ, సంతోషాలు మీ సొంతం కావాలంటే.. ఈ 5 విషయాలు పాటించమంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడి (Acharya Chanakya) మంచి రాజకీయ వ్యూహకర్త. చాణుక్యుడు తన నీతి శాస్త్రం (Niti shastra) లో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడి (Acharya Chanakya) మంచి రాజకీయ వ్యూహకర్త. చాణుక్యుడు తన నీతి శాస్త్రం (Niti shastra) లో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఇలా చెప్పిన విషయాల నుంచి అనేక విషయాలను నేర్చుకోవచ్చు. నీతిశాస్త్రంలో చెప్పిన విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. చాణక్య నీతిలో జీవితంలో మనిషి సంతోషకరమైన జీవితం పొందాలంటే.. మంచి పనులు చేయాలి. జీవితంలో సుఖ, సంతోషాలు నెలకొనాలంటే మనిషి ఏయే అంశాలను గుర్తుంచుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి తన శక్తికి మించి తనని తానూ ఎప్పుడూ ఇతరులకు గొప్పగా ప్రదర్శించుకోవద్దు. ఇలా చేసే వ్యక్తి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడు. అలాంటి వ్యక్తి అబద్ధాలు చెబుతూ.. తప్పులు చేస్తుంటాడు. తరువాత అనేక సమస్యల్లో మునిగిపోతాడు.
కోపం ఏ వ్యక్తికైనా శత్రువుగా పరిగణించబడుతుంది. ఎక్కువ కోపం కలిగిన వ్యక్తికి ఎప్పుడూ గౌరవం లభించదు. ప్రజలు కోపంగా ఉన్న వ్యక్తికి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. అలాంటి వ్యక్తి తనకు కష్టం వచ్చిన సమయంలో కూడా ఒంటరిగా మిగిలిపోతాడు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం..మనిషి అహంకారంతో ఉండకూడదు. అహం అన్నింటినీ నాశనం చేస్తుంది. అహం వ్యక్తిని సత్యానికి దూరంగా ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో, భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆచార్య చాణక్యుడు ప్రకారం, సోమరితనం ను మనిషి విడనాడాలి. ఎంత ప్రతిభ ఉన్న వ్యక్తి అయినా సోమరితనం ఉంటె ఆ వ్యక్తి ప్రతిభను నాశనం చేస్తుంది. అలా సోమరితనం ఉన్న వ్యక్తి ఇంతమంచి అవకాశాలు వచ్చినా కోల్పోతాడు. సోమరితనం ఒక వ్యక్తిని తన లక్ష్యానికి దూరం చేస్తుంది.