చాణక్య నీతి: మరణం తర్వాత వ్యక్తి తనతో తీసుకెళ్లేవి ఈ మూడే!
Chanakya Niti: మరణించిన తర్వాత వ్యక్తి ఖాళీ చేతులతో ఈ లోకం నుంచి వెళ్లిపోతాడని అంతా అనుకుంటారు. కానీ, నీతి శాస్త్ర పితామహుడు ఆచార్య చాణక్య మాత్రం మరణం తర్వాత వ్యక్తి తనతోపాటు మూడు ప్రత్యేకమైన విషయాలను తన వెంట తీసుకెళతారని చెబుతున్నారు. ఈ లోకంలో అతను చేసిన పనులకు సంబంధించిన ఫలితాలను తన వెంట తీసుకెళతారని అంటున్నారు.

పుట్టినప్పుడు ఎలా వచ్చామో.. చనిపోయినప్పుడు కూడా అలాగే వెళతామని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే.. పుట్టినప్పుడు ఏమీ తీసుకురాము.. చనిపోయినప్పుడు కూడా మన వెంట ఏమీ తీసుకెళ్లము అనే అర్థంలో ఈ వ్యాఖ్యాన్ని వాడతారు. అయితే, ఆచార్య చాణక్య మాత్రం ఇందుకు భిన్నంగా ప్రత్యేకమైన విషయం చెప్పారు. మనిషి తన మరణం తర్వాత మూడు వస్తువులు తీసుకెళతారని చెప్పుకొచ్చారు.
మరణం అనేది అందరికి చేదే అయినప్పటికీ పుట్టిన వారు ఎవరైనా మరణించక తప్పదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవీ తన శరీరాన్ని వదిలి తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత.. వారికి ప్రియమైనవారు కూడా శరీరంపై తమ అనుబంధాన్ని కోల్పోతారు. చనిపోయిన వ్యక్తి శరీరానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే చనిపోయిన వ్యక్తి ఖాళీ చేతులతోనే వెళ్లిపోతాడని.
కానీ, ఇప్పుడు చాణక్యుడు చెప్పిన ఆ మూడు విషయాల గురించి తెలుసుకుందాం. మరణం తర్వాత మూడు ప్రత్యేకమైన విషయాలు మాత్రం ఆత్మతోపాటు మరణాంతర జీవితానికి వెళతాయి.
మంచి, చెడు చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో మంచి, చెడు పనులు వారి ఆనందం, శ్రేయస్సుపై ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి చేసిన మంచి పనులు అతను మరణం తర్వాత అతని ఆత్మ స్వర్గానికి వెళుతుందా? లేక నరకానికి వెళుతుందా? అనేది నిర్ణయిస్తాయి. అందువల్ల వ్యక్తి మరణించిన తర్వాత ఈ రెండు పనులు అతని వెంట వెళతాయని చాణక్యుడు చెబుతారు. అందుకే పుట్టిన నాటి నుంచి మరణం వరకు మంచి పనులు చేయాలని మన పూర్వకాలం నుంచి చెబుతూనే ఉన్నారు.
గౌరవం
జీవితకాలంలో వ్యక్తి చేసిన మంచి పనులు సమాజంలో అతనికి గౌరవాన్ని తీసుకొస్తాయి. అలాంటి వ్యక్తులు మరణం తర్వాత కూడా వారి పనులతో గుర్తిండిపోతారు. దీనికి విరుద్ధంగా చెను పనులు చేసే వ్యక్తి జీవితాంతం గౌరవం లేకుండా ఉంటాడు. అలాంటి వ్యక్తులను మరణం తర్వాత కూడా ప్రజలు గౌరవించరు.
నెరవేరని కోరికలు
మానవుడు తన జీవితంలో అనేక కోరికలను కలిగి ఉంటాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవైనా నెరవేరాలని కోరుకుంటాడు. అయితే, ఆ కోరికలు కూడా నెరవేకుండానే కొందరు మరణిస్తారు. దీంతో మరణించిన వ్యక్తి ఆత్మతోపాటు ఈ కోరికలు కూడా వెళతాయి. అందుకే చనిపోయిన వ్యక్తి కోరికలను తీర్చడానికి ప్రత్యేక ప్రార్థనలు, మతపరమైన ఆచారాలు నిర్వహిస్తుంటారు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.
