Vastu Tips: ఇంట్లో హంసల జత చిత్రం.. ఎన్ని లాభాలో తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిత్రాలు లేదా బొమ్మలు ఇంట్లో ఉంటే మంచిది. వీటిని ఇంట్లో ఉంచడం పవిత్రంగా భావిస్తారు. మరికొన్ని వస్తువులను వాస్తు దోషాలు తొలగించేందుకు ఉపయోగపడతాయని శాస్త్రం చెబుతోంది. నివాసంలో హంసలకు సంబంధించిన ఫొటోలను పెట్టాలనుకుంటే మాత్రం వాస్తు శాస్త్రం పలు సూచనలు చేస్తోంది. హంసల జత ఫొటోను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రయోజనాలున్నాయని చెబుతోంది.

వాస్తు శాస్త్రం అనేది ఇంటి నిర్మాణంతోపాటు ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలి? ఎలాంటి వస్తువులను ఉంచకూడదో కూడా తెలియజేస్తుంది. అవి ఎక్కడ ఉంటే మంచిదో కూడా వివరిస్తుంది. చాలా మంది వాస్తు ప్రకారమే తమ ఇంటి నిర్మాణం తోపాటు ఇంట్లోని వస్తువులను ఆయా దిశల్లో ఏర్పాటు చేసుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిత్రాలు లేదా బొమ్మలు ఇంట్లో ఉంటే మంచిది. వీటిని ఇంట్లో ఉంచడం పవిత్రంగా భావిస్తారు.
తూర్పు దిశలో హంసల చిత్రం శుభప్రదం
మరికొన్ని వస్తువులను వాస్తు దోషాలు తొలగించేందుకు ఉపయోగపడతాయని శాస్త్రం చెబుతోంది. నివాసంలో హంసలకు సంబంధించిన ఫొటోలను పెట్టాలనుకుంటే మాత్రం వాస్తు శాస్త్రం పలు సూచనలు చేస్తోంది. హాలులో లేదా డ్రాయింగ్ రూంలో, గెస్ట్ రూంలో హంసల ఫొటో ఉంచినట్లయితే.. దాన్ని గదికి తూర్పు దిశలో ఉంచాలి. అలా చేయడం శుభప్రదం. అయితే, మీరు ఒక జత హంసలు, ఒకే హంస ఫొటోను ఎక్కడైనా ఉంచవచ్చు.
ఆర్థికంగా లాభం కలగాలంటే ఇలా చేయండి
మీరు ఆర్థికంగా లాభం కోరుకుంటే మీ డ్రాయింగ్ రూం లేదా గెస్ట్ రూంలో హంస చిత్రాన్ని వేలాడదీయండి. మీరు ఒక జత హంసలు లేదా ఒక హంస చిత్రాన్ని కూడా గోడకు వేలడదీయవచ్చు.
నెగిటివ్ ఎనర్జీ ఔట్
మీ ఇంట్లో హంసల చిత్రాన్ని ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లేదా మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో పురోగతిని పొందుతారు. మీ పనిలో విజయాన్ని అందుకుంటారు.
వైవాహిక జీవితంలో ప్రేమ
బెడ్ రూంలో హంసల జంట ఫొటో పెట్టడం వల్ల కూడా చాలా ప్రయోజనాలున్నాయి. ఈ ఫొటోను బెడ్ రూంలో ఉంచుకోవడం వల్ల వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇది భార్యాభర్తల మధ్య ఉద్రిక్తత, సంఘర్షణను తగ్గిస్తుంది. ప్రేమను పెంచుతుంది.
జ్జానం
హంస జ్జానరూపమైన సరస్వతి దేవి వాహనం. కాబట్టి, మీ ఇంట్లోని అధ్యయన గది(రీడింగ్ రూం)లో హంస చిత్రాన్ని ఉంచడం వల్ల సరస్వతి దేవీ ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబంలో జ్జానాన్ని ప్రసాదిస్తాయి. అలాంటి ఇంట్లో విద్యకు ఎప్పుడూ కొరత ఉండదు.
మీ పిల్లల స్టడీ టేబుల్‌పై హంస విగ్రహాన్ని ఉంచడం వల్ల వారు చదువులో రాణించడమే కాకుండా పరీక్షల్లోనూ విజయం సాధిస్తారు. స్టడీ టేబుల్‌పై హంస విగ్రహం పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా చేస్తుంది.
Note: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, అందుబాటులోని వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.
