AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఏపీలోని విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. అవి పూర్తిగా ఉచితం.. కేవలం ఐదు రోజులే అవకాశం

ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు స్కూల్, కాలేజీ విద్యార్థులకు అద్బుత అవకాశం. ఏపీలో ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం స్కూల్స్, కాలేజీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది. నేటి నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు..

Aadhaar Card: ఏపీలోని విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. అవి పూర్తిగా ఉచితం.. కేవలం ఐదు రోజులే అవకాశం
Andhra Schools
Venkatrao Lella
|

Updated on: Jan 05, 2026 | 7:12 AM

Share

స్కూల్, కాలేజీ విద్యార్థులు ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవడం అనేది తప్పనిసరి. చిన్నతనంలో ఉన్నప్పుడు ఆధార్ తీసుకుని ఉంటారు. కొంచెం పెద్ద అయ్యాక వేలిముద్రలు, ఐరిష్ వంటి బయోమెట్రిక్ వివరాలు మారుతూ ఉంటాయి. దీంతో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తప్పనిసరిగా తమ ఆధార్ బయోమెట్రిక్ డీటైల్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లి ఆధార్‌లోని వివరాలను అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు పట్టణంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి క్యూలైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ గ్రామంలోని స్కూల్లో మీ పిల్లలు ఆధార్ వివరాలు అప్డేట్ చేయించవచ్చు.

స్పెషల్ ఆధార్ క్యాంపులు

నేటి నుంచి ఏపీలోని అన్ని స్కూల్స్, కాలేజీల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు జరుగుతున్నాయి. జనవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడికి తీసుకెళ్లి ఆధార్ వివరాలు అప్డేట్ చేయించాలి. ఇక స్కూల్, కాలేజీ విద్యార్థులకు కొత్త ఆధార్ కావాలన్నా ఇక్కడే తీసుకోవచ్చు. స్కూళ్లల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తున్నారు. పిల్లలు ఆధార్ కార్డుల్లో మార్పులు చేసుకోకపోతే బయోమెట్రిక్ హాజరులో సమస్యలు ఏర్పడే అవకాశముంది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ విభాగం విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది.

ఫ్రీగా సేవలు

బయట ఆధార్ సెంటర్లలో బయోమెట్రిక్ డీటైల్స్ అప్డేట్ చేయించుకోవాలంటే ఫీజు వసూలు చేస్తారు. కానీ ఈ స్పెషల్ క్యాంపుల్లో ఎలాంటి ఫీజు ఉండదు. విద్యార్థులు ఉచితంగా తమ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయించుకోవచ్చు. సెప్టెంబర్ నుంచి ప్రతీ నెలా కొన్ని రోజుల పాటు ఈ క్యాంపులు నడుపుతున్నారు. ఏపీలో మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులు ఆధార్ వివరాలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు. కానీ కేవలం ఇప్పటివరకు కేవలం 5.94 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చేయించుకున్నారు. మిగిలిన 10.57 లక్షల మంది విద్యార్థుల కోసం ఈ క్యాంపులు జరుపుతున్నారు. దీంతో విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు స్పషట్ం చఏశారు.

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..