AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Neeti: గొప్ప నాయకుడు కావాలంటే ఉండాల్సిన లక్షణాలు ఇవే.. చాణక్యుడి సలహాలు పాటిస్తే ఇక ఎదురే ఉండదు..

ఆచార్య చాణక్యుడిని గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త, వ్యూహకర్తగా పేర్కొంటారు. అతని ఆలోచనా విధానం, చాణక్యనీతిలో బోధించిన విషయాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.

Chanakya Neeti: గొప్ప నాయకుడు కావాలంటే ఉండాల్సిన లక్షణాలు ఇవే.. చాణక్యుడి సలహాలు పాటిస్తే ఇక ఎదురే ఉండదు..
Chanakya Neeti
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2022 | 9:03 AM

Share

Chanakya Neeti – Leader Qualities: ఆచార్య చాణక్యుడిని గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త, వ్యూహకర్తగా పేర్కొంటారు. అతని ఆలోచనా విధానం, చాణక్యనీతిలో బోధించిన విషయాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. చాణక్యుడు అతని విధానాల బలంతో ఒక సాధారణ బాల చంద్రగుప్త మౌర్యుని చక్రవర్తిగా మార్చారు. అందుకే నేటికీ చాణక్యుడి విధానాలు పూర్వం వలెనే అనుసరిస్తుంటారు. చాలామంది ప్రజలు చాణక్యుడి విధానాలను తూచతప్పకుండా అనుసరించి.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చని పేర్కొంటారు. అతి పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మంచి నాయకుని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు.. మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి..? ఎప్పుడు ఎలా అనుసరించాలి అనే విషయాలను తెలుసుకుందాం..

  1. సహనం: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మంచి నాయకుడికి సహనం అనే గుణం ఉండాలి. దీంతో ఏ పనైనా సక్రమంగా చేయగలుగుతాడు. ఓపిక పట్టడం ద్వారా, మీరు ఖచ్చితంగా కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. అందుకే ఓపిక పట్టడం చాలా ముఖ్యం.
  2. ప్రణాళిక వేయండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ప్రణాళికాబద్ధంగా పనిచేసే వ్యక్తినే మంచి నాయకుడిగా పరిగణిస్తారు. క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడటానికి అతను ఇప్పటికే ఒక ప్రణాళికను కలిగి ఉండాలి. ఒక మంచి నాయకుడు తన ప్రణాళికను, తన బృందానికి సంబంధించిన విషయాలను ఇతరుల ముందు ఎప్పుడూ పంచుకోకూడదు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఎవరైనా ప్రయోజనం పొందడం లేదా నష్టం చేకూర్చే ప్రమాదం ఉంటుంది.
  3. జాగ్రత్తగా ఉండండి : ఏదైనా పని పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉన్నవాడే మంచి నాయకుడు. పని పూర్తికాకముందే విజయోత్సవ వేడుకలు జరుపుకోవద్దు. అందుకే మంచి నాయకుడు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యే వరకు జాగ్రత్త పడాలి.
  4. సహోద్యోగుల నుంచి సలహా తీసుకోండి : ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఏదైనా పనిని ప్లాన్ చేయడం లేదా చేయడం ప్రారంభంలో తన సహోద్యోగులను సంప్రదించేవాడే మంచి నాయకుడు. ఇది పనిలో సృజనాత్మకతను పెంచుతుంది. విజయం చేకూరేలా చేస్తుంది.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..