Prakasam: కన్నుల పండుగగా రఘునాయక స్వామి కళ్యాణం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమై గరుడ పక్షి ప్రదక్షిణలు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతా లక్ష్మణ సమేత రఘునాయక స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు.

Prakasam: కన్నుల పండుగగా రఘునాయక స్వామి కళ్యాణం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమై గరుడ పక్షి ప్రదక్షిణలు
Ranganayaka Swamy Kalyanam
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 07, 2023 | 3:47 PM

ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహొత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపారని అందువల్లే ఈ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు వచ్చిందని స్థలపురాణం. ప్రతి ఏటా చైత్ర శుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

Ranganayaka Swamy Kalyanam

గరుడపక్షి ఆగమనం…

ఈ కళ్యాణ వేడకల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదే, స్వామివారి కళ్యాణం రోజున స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువును ప్రారంభించారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళ్లింది. భక్తులు గరుడపక్షిని చూసి భక్తితో మైమరచిపోయారు. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. కన్నులపండువగా నిర్వహించిన ఈ కళ్యాణవేడకుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?