Black Thread on Foot: పాదాలకు నల్ల దారం కట్టడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుందా? నమ్మకం వెనుక రీజన్ ఏమిటంటే
భారతదేశంలో శతాబ్దాలుగా నలుపు రంగు చెడు దృష్టి నుంచి రక్షణ కల్పిస్తుందని భావిస్తారు. మణికట్టు, మెడలో, పాదాలకు, చేతి మణికట్టుకి నల్ల దారం కట్టుకునే వ్యక్తులను మీరు తరచుగా చూసి ఉంటారు. అయితే పాదాలకు నల్ల దారం కట్టుకోవడం వల్ల నిజంగా ప్రతి కూల శక్తి తొలగి పోతుందా..! చెడు దృష్టి తొలగిపోతుందా? ఈ రోజు తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయం, మత విశ్వాసంలో నల్ల దారం కట్టే ఆచారం చాలా పురాతనమైనది. పుట్టిన శిశువుల నుంచి, చిన్న పిల్లలు, యువకులు లేదా పెద్దలు కూడా వారి పాదాలకు లేదా చేతులకు నల్ల దారం కట్టుకోవడం చూసి ఉంటారు. దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే ఇది చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అయితే నల్ల దారం కట్టుకోవడం వలన నిజంగా చెడు దృష్టి నుంచి విముక్తి లభిస్తుందా? వివరంగా తెలుసుకుందాం.
కాలికి నల్ల దారం కట్టుకోవడం వెనుక ఉన్న సంప్రదాయం భారతీయ సంస్కృతి, జ్యోతిషశాస్త్రంలో చెడు దృష్టి అనేది ఒక సాధారణ నమ్మకం. కొంతమంది వ్యక్తుల ప్రతికూల శక్తి ఒక వ్యక్తి, వస్తువు లేదా ఒక ప్రదేశంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. అందుకే ప్రజలు దీనిని నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటారు.వాటిలో నల్ల దారం ధరించడం కూడా ఒకటి. పాదాలకు నల్ల దారం ధరించే సంప్రదాయం చాలా పురాతనమైనది. దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే ఎవరైనా తమ అందాన్ని, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం లేదా విజయాన్ని చూసి అసూయపడినప్పుడు.. వారి ప్రతికూల శక్తి మొదట మీ పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇలా కాలికి నల్ల దారం కట్టుకుంటే.. ఈ ప్రతికూల శక్తిని శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందని నమ్మకం.
జ్యోతిషశాస్త్రం, మత విశ్వాసాలు జ్యోతిషశాస్త్రంలో నలుపు రంగును శని గ్రహానికి చిహ్నంగా భావిస్తారు. శనిని న్యాయ దేవుడిగా , దుష్ట శక్తులను నియంత్రించే వ్యక్తిగా భావిస్తారు. అందువల్ల పాదానికి నల్ల దారం కట్టడం వల్ల శని దోషం తొలగిపోతుంది. దుష్ట శక్తుల ప్రభావాల నుంచి రక్షిస్తుందని విశ్వాసం. దీనితో పాటు కొంతమంది దీనిని భైరవ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తారు. భైరవ దేవుడి దుష్ట శక్తులను నాశనం చేసే వ్యక్తిగా భావిస్తారు. అతని పేరులో నల్ల దారం ధరించడం వలన వ్యక్తి సురక్షితంగా ఉంటాడు.
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు?
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం వల్ల శరీరంలో శక్తి సమతుల్యత కాపాడుకోవడంలో కూడా సంబంధం ఉంది.
దీన్ని పాదాలకు కట్టడం వల్ల ప్రతికూల శక్తి ప్రవేశించడం ఆగిపోతుందని నమ్ముతారు.
పురుషులు కుడి కాలికి, స్త్రీలు ఎడమ కాలికి నల్ల దారం కట్టే సంప్రదాయం ఉంది.
నల్ల దారం ధరించాలంటే
పాదాలకు నల్ల దారం ధరించడం అనేది వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. ఈ నమ్మకాన్ని విశ్వసించి, దాని నుండి మానసిక ప్రశాంతతను లభిస్తుందని నమ్మితే.. కాలికి నల్ల దారం ధరించడంలో ఎటువంటి హాని లేదు. అయితే సానుకూల ఆలోచన, కృషి, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి. నల్ల దారం మీరు సురక్షితంగా ఉన్నారని, జీవితంలోని ప్రతి సవాలును ఎదుర్కోగలరని గుర్తు చేసే చిహ్నం మాత్రమే.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








