World Richest Village: ప్రపంచంలోనే ధనిక గ్రామం మనదేశంలోనే ఉందని తెలుసా..! ఇక్కడ ప్రతి వ్యక్తి కోటేశ్వరుడే..
ప్రపంచంలోని అత్యంత ధనిక గ్రామం మన దేశంలోనే ఉందని తెలుసా.. ఈ ధనిక గ్రామంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 24 గంటలు విద్యుత్ అందుబాటులో ఉంది. ఈ గ్రామంలో చాలా పెద్ద బ్యాంకులు ఉన్నాయి. ఒక పెద్ద ఆసుపత్రి ఉంది. పిల్లల విద్య కోసం ఆధునిక డిజిటల్ పాఠశాల ఉంది. ఈ గ్రామంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రామంలోని చాలా మంది ప్రజలు లక్షాధికారులున్నారు. ఆ ధనిక గ్రామం గురించి తెలుసుకుందాం..

గ్రామం అనే పదం వినగానే మనకు గుర్తుకు వచ్చే చిత్రాలు ఎక్కువగా మట్టి ఇళ్ళు, బావులు, పచ్చని పొలాలు, కష్టపడి పనిచేసే రైతులు, బావుల నుంచి నీరు తెచ్చుకునే మహిళలు, మట్టి రోడ్లు గుర్తుకొస్తాయి. నేటికీ, చాలా గ్రామాలకు విద్యుత్, నీరు, మంచి రోడ్లు, మంచి పాఠశాలలు, పెద్ద ఆసుపత్రులు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు. అయితే భారతదేశంలో ఒక గ్రామం ఉంది.. ఈ గ్రామం ముందు పెద్ద నగరాలు కూడా దిగదుడుపే అనిపిస్తాయి. ఇది దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం.. ఇక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ గ్రామం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దీని పేరు మాధపర్. ఈ గ్రామం మొత్తం జనాభా ఇప్పుడు దాదాపు 92,000, అంటే దాదాపు లక్ష. ఈ గ్రామంలో 7,600 ఇళ్ళు ఉన్నాయి. ఈ గ్రామంలో ఒకటి లేదా రెండు కాదు 17 బ్యాంకు శాఖలు ఉన్నాయి. మాధపర్ గ్రామ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. గ్రామ ప్రజలు ఈ బ్యాంకుల్లో దాదాపు 5 వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్ చేశారు. అతిపెద్ద నగరాల్లో కూడా ఇంత పెద్ద మొత్తాన్ని చాలా కష్టంతో బ్యాంకుల్లో జమ చేస్తారు.
ఈ గ్రామం ఇంత ధనిక గ్రామం ఎలా అయిందంటే మాధపర్ లోని అనేక కుటుంబాలు వ్యాపారం, ఉపాధి కోసం విదేశాలలో స్థిరపడ్డాయి. ఈ గ్రామ ప్రజల పరిశ్రమలు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలలో అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఆ గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని మరచిపోలేదు. ఈ NRIలు ప్రతి నెలా తమ కుటుంబాలకు భారీ మొత్తంలో డబ్బును పంపుతారు. ఈ ప్రజలు గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో సహకరిస్తున్నారు. గ్రామంలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక పనులలో వారు చాలా సహాయం చేస్తారు. ఈ గ్రామాన్ని ఆధునికంగా మార్చడంలో ఈ ప్రవాసాంధ్రులు పెద్ద పాత్ర పోషించారు.
ఈ గ్రామం 12వ శతాబ్దంలో స్థిరపడింది. మాధపర్ గ్రామం 12వ శతాబ్దంలో స్థిరపడింది. అంటే ఈ గ్రామం స్థిరపడి 800 సంవత్సరాలకు పైగా అయింది. కచ్‌లోని మిస్త్రి సమాజం ఈ గ్రామానికి పునాది వేసింది. ఈ సమాజం గుజరాత్‌లోనే కాకుండా భారతదేశం అంతటా అనేక ముఖ్యమైన దేవాలయాలను నిర్మించింది. అనేక చారిత్రక భవనాలు కూడా నిర్మించింది. తరువాత అనేక వర్గాల ప్రజలు ఈ గ్రామంలో నివసించడం మొదలు పెట్టారు. నేడు ఈ గ్రామంలో పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, తమిళం, మరాఠీ, కాశ్మీరీ వంటి అన్ని రకాల ప్రజలు నివసిస్తున్నారు.
ఈ గ్రామంలో నగరాల కంటే మెరుగైన సౌకర్యాలు మాధపర్‌లో పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ఆరోగ్య కేంద్రాలు, తోటలు, రోడ్లు సహా ఏ పెద్ద నగరాన్నైనా సిగ్గుపడేలా చేసే సౌకర్యాలు ఉన్నాయి. ఈ గ్రామ ప్రజల జీవనశైలి, సౌకర్యాలు నగరం కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ గ్రామం వేగంగా అభివృద్ధి చెందుతూ నగరాన్ని అధిగమించింది. ఈ గ్రామం భారతదేశం నిజమైన బలం గ్రామాలలో ఉందని సందేశం చెప్పకనే చెబుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







