AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi 2025: పర్యావరణ హితం కోసం ఇంట్లోనే గణపతిని చేయండి.. మట్టితో సహా ఏ వస్తువులతో చేసుకోవచ్చంటే

ఈ సంవత్సరం ఆగస్టు 27న వినాయక చవితి పండగను జరుపుకోనున్నారు. గల్లీ గల్లీ మండపాలను ఏర్పాటు చేసి గణపతి బప్పా విగ్రహాలను ప్రతిష్టించి పుజిస్తారు. అదే విధంగా వినాయక చవితి రోజున ఉత్సాహంగా ఇంటిలో కూడా గణపతి పూజలను చేస్తారు. ఈ రోజున గణపతి విగ్రహాన్ని కొంత మంది మార్కెట్ నుంచి తీసుకొస్తారు. అయితే పర్యావరణ హితకరమైన వినాయక విగ్రహాలను ఇంట్లోనే అందంగా తయారు చేసుకోవచ్చు.

Vinayaka Chavithi 2025: పర్యావరణ హితం కోసం ఇంట్లోనే గణపతిని చేయండి.. మట్టితో సహా ఏ వస్తువులతో చేసుకోవచ్చంటే
Eco Lord Ganesha Idols
Surya Kala
| Edited By: TV9 Telugu|

Updated on: Aug 21, 2025 | 6:16 PM

Share

విఘ్నాలకు అధిపతి వినాయకుడు పుట్టిన రోజుని వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 27న వినాయక చవితిని జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. చవితి రోజున గణపయ్యని పూజించేందుకు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తారు. తమ ఇంట్లో 5, 7, 9 లేదా 10 రోజుల పాటు పూజని నిర్వహిస్తారు. ఈ పూజ సమయంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలు, స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. నియమాలను అనుసరించి పూజ చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. గణేష్ విగ్రహాన్ని బహిరంగ ప్రదేశాలలో లేదా మండపాలలో ప్రతిష్టిస్తారు.

మార్కెట్లో అన్ని పరిమాణాలలో అందమైన గణేశుడి విగ్రహాలు లభ్యం అవుతాయి. అయితే చాలా విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే POP తో తయారు చేయబడి ఉంటాయి. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తాయి. అందుకనే పర్యావరణ పరిరక్షణ కోసం POP గణపతి విగ్రహాలు వద్దు.. పర్యావరణ అనుకూల విగ్రహాలను ప్రతిష్టించమని చెబుతున్నారు. ఈ రోజు మట్టి పసుపు వంటి వాటితో పర్యావరణ హిత వినాయక విగ్రహాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

మట్టితో గణేశ విగ్రహాన్ని తయారు చేయండి స్వచ్ఛమైన బంకమట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేయవచ్చు. దీని కోసం ముందుగా ఒక పీట తీసుకుని దానిపై ఒక ప్లేట్ పెట్టి దానిపై కొబ్బరి నూనె రాయండి. బంకమట్టికి కొద్దిగా నీరు పోసి బాగా పిసికి కలుపుకోండి. బంకమట్టి మెత్తగా మారిన తర్వాత చిన్న భాగాలను తయారు చేసి గణేశుడి శరీర భాగాలను తయారు చేయండి. క్రమంగా ఆ భాగాలను కలుపుతూ గణపతి ఆకారాన్ని సిద్ధం చేయండి. తరువాత దానిని తీసి టూత్‌పిక్ సహాయంతో తామర పువ్వును తయారు చేయండి. దీని తరువాత విగ్రహాన్ని ఆరనివ్వండి. ఎండలో కాకుండా నీడలో పెట్టి ఎండబెట్టిన తర్వాత, విగ్రహంలోని రంగును పసుపు, కుంకుమ లేదా సహజ రంగులతో నింపండి.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

పిండితో శిల్పం తయారు చేయండి గణపతి విగ్రహాన్ని తయారు చేయడానికి.. బియ్యం పిండిని లేదా గోధుమ పిండిని నీటితో కలిపి మట్టిలాగా చేయాలి. ఇప్పుడు దానితో బప్పా విగ్రహాన్ని తయారు చేయండి. దీని తరువాత రంగులను వేయడానికి తేలికపాటి సహజ రంగులను ఉపయోగించండి. ఈ విగ్రహం నిమజ్జనం సమయంలో చాలా త్వరగా కరిగిపోతుంది.

పసుపుతో వినాయకుడు విగ్రహాన్ని తయారు చేయడానికి పసుపును కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ముందుగా పసుపు , మైదా పిండిని తీసుకొని దానిలో నీరు కలిపి మెత్తగా పిసికి బప్పా విగ్రహం ఆకారాన్ని ఇవ్వండి. అలాగే బటన్లు లేదా రంగు సహాయంతో కళ్ళను తయారు చేయవచ్చు. ఈ విగ్రహం చాలా అందంగా కనిపిస్తుంది.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

View this post on Instagram

A post shared by Sunitha (@sunnis.kitchen)

పాత కాగితంతో గణపతి విగ్రహం తయారు చేయండి ఇంట్లో ఉన్న వార్తాపత్రికలు, కాగితాలను ఉపయోగించి మీరు విగ్రహాన్ని తయారు చేయవచ్చు. దీని కోసం ముందుగా వార్తాపత్రికను చింపి నీటిలో నానబెట్టి పేస్ట్ తయారు చేయండి. దీని తరువాత, దానికి పిండిని జోడించడం ద్వారా మందపాటి పేస్ట్‌ను సిద్ధం చేయండి. ఇప్పుడు దానికి విగ్రహం ఆకారాన్ని ఇచ్చి ఆరబెట్టడానికి పక్కన పెట్టండి. దీని తరువాత, దానిని సహజ రంగులతో నింపండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా