మిస్ యూనివర్స్ ఇండియా మణికా.. అందమైన మనసు కూడా సొంతం.. సామాజిక సేవ, నాడీ వైవిధ్యానికి అంకిత భావం
రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా-2025 టైటిల్ ని మాణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ గెలుచుకుంది. ఈ పోటీలో దేశంలోని అందగత్తెలతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన అందగత్తెలు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలో మాజీ విజేత రియా సింఘా.. మాణికాకు మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటాన్ని అలంకరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాన్యశర్మ ఫస్ట్ రన్నరప్‌గా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. మాణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ ను సొంతం చేసుకున్న మాణికా విశ్వకర్మ ఎవరో తెలుసుకుందాం.

రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన గొప్ప వేడుకలో మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని 18 ఆగస్టు 2025న గెలుచుకుంది. గత సంవత్సరం మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింఘా.. మణికా విశ్వకర్మకు కిరీటాన్ని అలంకరించింది. ఇప్పుడు నవంబర్‌లో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలలో మణికా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ మిస్ యూనివర్స్ పోటీలో 130 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొనబోతున్నారు. మణికా విశ్వకర్మ ఎవరు? ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
మణికా విశ్వకర్మ ఎవరు? మణికా విశ్వకర్మ రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో నివసిస్తోంది. ఆమె పొలిటికల్ సైన్స్ , ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని. మరో వైపు ప్రస్తుతం ఢిల్లీలో మోడలింగ్ చేస్తోంది. గత సంవత్సరం మిస్ యూనివర్స్ రాజస్థాన్ టైటిల్‌ను గెలుచుకున్న మణికా.. ఆ తర్వాత జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకుంది.
సామాజిక సేవ, నాడీ వైవిధ్యానికి అంకితభావం మణికాకు అందమైన ముఖం మాత్రమే కాదు.. అందమైన మనసు ఉంది. సామాజిక కార్యకర్త కూడా. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడానికి చాలా కృషి చేస్తోంది. ఆమె న్యూరోనోవా అనే వేదికను స్థాపించింది. ఇది న్యూరోడైవర్జెంట్ వ్యక్తులకు (అంటే మెదడు సాధారణం కంటే భిన్నంగా పనిచేసే వ్యక్తులు) అవగాహన కల్పిస్తుంది. ADHD వంటి పరిస్థితులను ఒక రుగ్మతగా చూడకూడదని, వేరే రకమైన మానసిక సామర్థ్యంగా చూడాలని ఆమె నమ్ముతుంది.
మణికా సాధించిన మరెన్నో విజయాలు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని BIMSTEC సెవోకాన్‌లో మణికా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. శిక్షణ పొందిన NCC క్యాడెట్, క్లాసికల్ డ్యాన్సర్ , కళాకారిణి మాత్రమే కాదు ఆమె అద్భుతమైన వక్త కూడా. ఆమెను లలిత కళా అకాడమీ, JJ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కూడా సత్కరించాయి.
తన విజయం గురించి మణికా ఏమన్నదంటే మిస్ యూనివర్స్ ఇండియా అయిన తర్వాత మణికా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసి.. “నేను మిస్ యూనివర్స్ రాజస్థాన్ కిరీటాన్ని నా వారసురాలికి అప్పగించిన రోజు.. , నేను అదే రోజు మిస్ యూనివర్స్ ఇండియా ఆడిషన్‌లో నిలబడి ఉన్నాను.. ఒక అధ్యాయాన్ని ముగించి అదే రోజు మరొక అధ్యాయాన్ని ప్రారంభించడం యాదృచ్చికం కాదు, విధి. వృద్ధి కోసం ఎల్లప్పుడూ ఆగాల్సిన అవసరం లేదని ఇది సంకేతం అని చెప్పింది.
మిస్ యూనివర్స్ 2025 పోటీ ఎప్పుడు జరుగుతుంది? ఈ సంవత్సరం 74వ మిస్ యూనివర్స్ పోటీ థాయిలాండ్‌లో జరగనుంది. ఇది నవంబర్ 21న ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్‌లో జరుగుతుంది. ఈ పోటీ చివరి రౌండ్‌లో.. ప్రపంచం తన కొత్త మిస్ యూనివర్స్‌ను ఎన్నుకోబడతారు. గత సంవత్సరం మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న విక్టోరియా కైజర్ థాల్విగ్.. కొత్తగా ఎంపికైన మిస్ యునివర్స్ కి తన కిరీటాన్ని ధరిస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








