Andhra Pradesh: బాధ్యత గల పౌరుడు ఇతను.. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా లాయర్ నిశ్శబ్ద ఉద్యమం..
మనిషి జీవిత విధానంలో సులభతరం అంటూ వచ్చిన ప్లాస్టిక్ వచ్చింది. కాలక్రమంలో ప్లాస్టిక్ లేనిదే మనిషి జీవితం లేదు అన్నంతగా రోజులుమారిపోయాయి. అయితే ప్లాస్టిక్ వినియోగం ఈజీ అయినా పర్యావరణానికి, మనిషి ప్రాణాలకు ప్రమాదకరంగా మారాయి అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారణ కోసం అనేక రకాల చర్యలను పేర్కొంటూ మనుషులకు అవేర్నెస్ కల్గించే ప్రయత్నాలు చేస్తున్నారు.. అయినప్పటికీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించలేకపోతున్నారు. ఈ ప్లాస్టిక్ వినియోగం వలన ఏదొక రూపంలో శరీరంలోకి ప్రవేశించి ప్రమాదకమైన జబ్బులు బారిన పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు లాయర్ వినూత్న ఆలోచన నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ప్లాస్టిక్ వినియోగం పర్యవరాణానికి పరిసరాలకు మాత్రమే కాదు మనుషులు, పశువుల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించిన తర్వాత వాటిని బయట పడేస్తాం. అవి మట్టిలో కలువవు. అలా పర్యావరణానికి హానిని కలిగిస్తున్నాయి. మరోవైపు ప్లాస్టిక్ వినియోగం వల్ల మానవ ఆరోగ్యంపై కలిగే ప్రభావం గురించి మాత్రమే కాదు ప్లాస్టిక్ నియంత్రణ గురించి ఐక్యరాజ్యసమితి తరచుగా హెచ్చరిస్తూనే ఉంది. ప్లాస్టిక్ ఏదో రూపంలో శరీరంలోకి ప్రవేశించి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తుందనే వార్తలు తరచుగా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్లాస్టిక్ వినియోగానికి ఎక్కడ అడ్డు కట్ట పడడం లేదు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లకు వెళ్ళినా విందు భోజనం సమయంలో ప్లాస్టిక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. టేబుల్ మీద పరచే ప్లాస్టిక్ కవర్ నుంచి తినే ప్లేట్ వరకూ ఎక్కువగా ప్లాస్టిక్ నే ఉపయోగిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక న్యాయవాది సరికొత్తగా అలోచించి.. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద ఉద్యమాన్ని చేస్తున్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరులో నివసిస్తున్న గరుడాద్రి సుదర్శన్ లాయర్. ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే ముప్పుపై ప్రజలకు అవగాహన కలిగించాలని భావించాడు. జీవన విధానంలో మార్పు తప్పని సరి అని.. ప్లాస్టిక్ లేని జీవితాన్ని గడిపేలా ఆలోచించే దిశగా ప్రజలు ఆడుగులు వేయాలని సుదర్శన్ భావించారు. అందుకనే సుదర్శన్ ఎక్కడకు భోజనం చేయడానికి వెళ్ళినా.. తన వెంట ఒక స్టీల్ ప్లేట్, గ్లాసుని తీసుకుని వెళ్తాడు. తన ప్లేట్ లోనే ఆహార పదార్ధాలను వడ్డించుకుని తింటారు. తన గ్లాస్ లో నీరు పోసుకుని తాగుతారు.
ఒక్క విందు భోజనం సమయంలోనే కాదు.. ఎక్కడైనా బయట టీ తాగాలనే.. ఆ షాప్ లోని ప్లాస్టిక్ గ్లాస్ కు బదులుగా తనతో వెంట తీసుకుని వెళ్ళిన స్టీల్ గ్లాస్ ని ఉపయోగిస్తాడు. అంతేకాదు ఎక్కడైనా పండ్లు, కూరగాయలు వంటి వాటిని కొనుగోలు చేయాలనీ భావించినా ప్లాస్టిక్ కవర్ ఉపయోగించరు. దీంతో ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పని ఇప్పుడు పలువురుని ఆకర్షిస్తుంది. సుదర్శన్ గురించి బాధ్యత గల పౌరుడు.. చట్టం తెలిసిన న్యాయవాది. ప్లాస్టిక్ వినియోగాన్ని ఎలా తగ్గించవచ్చో నిబద్ధతతో తెలియజేస్తూ మరింత మందికి స్పూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







