AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathukamma Sarees 2021: 290 రంగుల్లో బతుకమ్మ చీరలు.. అక్టోబర్ 2 నుంచి పంపిణీ షురూ. ఇదీ.. పొందే విధానం

కేసీఆర్ ప్రభుత్వం బ్రతుకమ్మ పండగ సందర్భంగా ఏటా పేద మహిళలకు పంపిణీ చేసే చీరలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఇప్పటికే చీరలు అన్ని..

Bathukamma Sarees 2021: 290 రంగుల్లో బతుకమ్మ చీరలు.. అక్టోబర్ 2 నుంచి పంపిణీ షురూ. ఇదీ.. పొందే విధానం
Batukamma Sarees
Venkata Narayana
|

Updated on: Sep 29, 2021 | 11:40 AM

Share

Bathukamma Sarees – Festival 2021: కేసీఆర్ ప్రభుత్వం బ్రతుకమ్మ పండగ సందర్భంగా ఏటా పేద మహిళలకు పంపిణీ చేసే చీరలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఇప్పటికే చీరలు అన్ని జిల్లాలకు చేరాయి. అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. (అక్టోబరు 2) ఎల్లుండి నుంచి చీరల పంపిణీ చేయబోతున్నారు. ఈ సారి సరికొత్తగా ఏకంగా 290 రంగుల్లో బతుకమ్మ చీరలు తయారుచేయించారు. గతేడాది పంపిణీ సందర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించిన మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఈ సారి సరికొత్తగా 19 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 290 వర్ణాలలో సరికొత్తగా రూపొందించారు.

డాబీ అంచు చీరలు ఈ సారి బతుకమ్మ పండుగకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది. అటు, చీరల ప్యాకింగునూ ఆకర్షణీయంగా చేశారు. చీరల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పోరేషన్ డివిజన్ల వారీగా రేషన్‌ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండగా.. ఈ ఏడాది రూ.318 కోట్లను వెచ్చించింది. దాదాపు 16 వేల మగ్గాలపై పది వేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేశాయి.

గ్రామాల్లో రేషన్‌ డీలర్‌, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీ.. పట్టణాలు, నగరాల్లో రేషన్‌ డీలర్‌, మున్సిపల్ బిల్‌ కలెక్టర్‌, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. ఆహార భద్రత కార్డులతో వచ్చి మహిళలు చీరలు తీసుకోవచ్చు.

అయితే, చీరల పంపిణీ మీద 31 జిల్లాల్లో స్పష్టత వచ్చినా.. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక దృష్ట్యా కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన అనంతరం ఈ రెండు జిల్లాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read also: పొలిటికల్ లీడర్లు, రెవెన్యూ అధికారులు కలిసి రూ. కోట్ల భూములు కొట్టేశారు..! ఇదీ.. స్కెచ్