Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఏ రాశిఫలితాలు ఎలా ఉంటాయంటే..
Horoscope Today(September 30-09-2021): చాలామంది ఏ కొత్తపనిని మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసిస్తారు. అంతేకాదు..
Horoscope Today (September 30-09-2021): చాలామంది ఏ కొత్తపనిని మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసిస్తారు. అంతేకాదు తాము పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 30న ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రాశివారికి ఈరోజు అధిక శ్రమపడాల్సి ఉంటుంది. శారీరక అనారోగ్యానికి, మానసిక ఆందోళనకు గురవుతారు. కుటుంబం కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు చేస్టారు. దైవ ధ్యానం మంచింది.
వృషభ రాశి: ఈ రాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటారు. మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్ధిక పరిష్టితి అనుకూలంగా ఉండదు.
మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు చేపట్టిన కొత్త పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనోధైర్యంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. ఎదుటివారితో మాట్లాడేసమయంలో కొంచెం సంయమనం పాటించాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారికి ఈరోజు వృత్తి రీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య బాధలకు గురవుతారు. పిల్లల పట్ల జాగ్రత్తాగా ఉండడం మంచిది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహ రాశి: ఈరోజు ఈరాశివారికి బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. మానసిక ఆందోళకు గురవుతారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్తగా పనులు వాయిదా వేసుకోవడం మంచింది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
తులా రాశి: ఈ రాశివారికి ఈరోజు అనారోగ్య బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలుగుటఁది. బంధు మిత్రులతో శత్రుత్వం ఏర్పడకుండా ఉండడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయంలో లాభాలను అందుకుంటారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. ప్రయాణాలవలన లాభాలు చేకూరతాయి. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశి వారికి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్ధికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్తగా చేపట్టే పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాల కోసం వేచి చూడాల్సి ఉంది.
మీన రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్ధ్యాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు సంతోషంగా గడుపుతారు.
Also Read: