AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balapur Ganesh Laddu: గత రికార్డ్‌ని బీట్ చేసిన బాలాపూర్ లడ్డు.. ఈ ఏడాది ఎంత ధర పలికిందంటే

బాలాపూర్‌ గణేశుడితో పాటు పది రోజులు భక్తులతో పూజలను అందుకున్న లడ్డూ రికార్డ్ ధర పలికింది. ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూని బిజేపీ సీనియర్ నేత కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. వేలం పాటలో గత రికార్డ్ ని బీట్ చేస్తూ  30 లక్షల వెయ్యి రూపాయలకు శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. 

Balapur Ganesh Laddu: గత రికార్డ్‌ని బీట్ చేసిన బాలాపూర్ లడ్డు.. ఈ ఏడాది ఎంత ధర పలికిందంటే
Balapur Ganesh Laddu
Surya Kala
|

Updated on: Sep 17, 2024 | 11:05 AM

Share

హైదరబాద్ లో ఓ వైపు గణపతి నిజమజ్జనం వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. మరోవైపు ఖైదరాబాద్ వినాయకుడు గంగమ్మ చెంతకు శోభాయత్రగా పయనం అయ్యాడు.. ఇదే సమయంలో బాలాపూర్‌ గణేశుడితో పాటు పది రోజులు భక్తులతో పూజలను అందుకున్న లడ్డూ రికార్డ్ ధర పలికింది. ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూని బిజేపీ సీనియర్ నేత కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. వేలం పాటలో గత రికార్డ్ ని బీట్ చేస్తూ  30 లక్షల వెయ్యి రూపాయలకు శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.

అయితే ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూ వేలం పాట నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు. లడ్డు వేలం పాటలో పాల్గొనడానికి,  దక్కించుకోవడానికి ఈ ఏడాది డిపాజిట్ తప్పని సరి చేశారు. అది కూడా గత ఏడాది లడ్డు ధరైన రూ. 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం అనే నిబంధన పెట్టారు. దీంతో ఈ లడ్డుని దక్కించుకోవాడానికి చైతన్య స్టిల్స్ అధినేత లింగాల దశరథ్ గౌడ్, సాహెబ్ నగరానికి చెందిన  అర్బన్ గ్రూప్ అధినేత  ప్రణీత్ రెడ్డి, బాలాపూర్ కి చెందిన  బిజేపీ సీనియర్ లీడర్ కొలన్ శంకర్ రెడ్డి , నాదర్గుల్ కి చెందిన

శ్రీ గీతా డైరీ అధినేత లక్ష్మీనారాయణలు వేలం పాటలో పాల్గొనడానికి కావాల్సిన డిపాజిట్ కట్టారు. చివరికి శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూని 30లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..