AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: కళాకారుడి అపురూప సృష్టి.. అయోధ్య రామాలయం.. కార్మికుల ఆనందం త్రీడీ ఎఫెక్స్ట్‌లో రంగోలి..

నగరంలోని ఓ ప్రైవేట్ మాల్ లో  రామాలయ రూపంతో ఉన్న రంగోలీ చూపరులను ఆకర్షిస్తోంది. ఈ రంగోలి చిత్రం 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో డిజైన్ చేశారు. అయితే ఈ చిత్రంలో మరో విశేషమేమిటంటే రామమందిర నిర్మాణం సమయంలో పని చేసిన కార్మికులు తదితరులు.. రామమందిర నిర్మాణం అయ్యాక దర్శనం చేసుకున్నట్లు ఉన్నది. ఈ  రాముడి దర్శనం అనే కాన్సెప్ట్ ను త్రీడీ ఎఫెక్ట్ లో కళాకారుడు ఆవిష్కరించాడు.

Ayodhya: కళాకారుడి అపురూప సృష్టి.. అయోధ్య రామాలయం.. కార్మికుల ఆనందం త్రీడీ ఎఫెక్స్ట్‌లో రంగోలి..
Ram Mandir Rangoli
Surya Kala
|

Updated on: Jan 13, 2024 | 6:07 PM

Share

అయోధ్యలో రామయ్య కొలువుదీరే సమయం ఆసన్నం అవుతోంది. రామాలయ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో దేశ విదేశాల్లో రామనామ స్మరణతో మారు మ్రోగుతోంది. రాముడిపై భక్తిని ప్రజలు వివిధ మార్గాల్లో చాటు కుంటున్నారు. తాజాగా ఓ ప్రయివేట్ స్కూల్ లో స్టూడెంట్స్ తమ ప్రతిభకు వన్నె తెచ్చే విధంగా ధర్మా కోల్ తో అయోధ్య రామయ్య ఆలయ రూపాన్ని మలచారు. అంతేకాదు ఓ కళాకారుడు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి పురష్కరించుకుని రంగోలి వేశారు. బెంగళూరులోని  ఓ ప్రైవేట్ మాల్ అయోధ్య రామ మందిర రూపంతో ఉన్న రంగోలీ చూపరులను ఆకర్షిస్తోంది.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో సిలికాన్ సిటీలో రాముడి స్మరణ హోరెత్తుతోంది. రామమందిరం రంగోలిలో వికసిస్తోంది. నగరంలోని ఓ ప్రైవేట్ మాల్ లో  రామాలయ రూపంతో ఉన్న రంగోలీ చూపరులను ఆకర్షిస్తోంది. ఈ రంగోలి చిత్రం 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో డిజైన్ చేశారు. అయితే ఈ చిత్రంలో మరో విశేషమేమిటంటే రామమందిర నిర్మాణం సమయంలో పని చేసిన కార్మికులు తదితరులు.. రామమందిర నిర్మాణం అయ్యాక దర్శనం చేసుకున్నట్లు ఉన్నది. ఈ  రాముడి దర్శనం అనే కాన్సెప్ట్ ను త్రీడీ ఎఫెక్ట్ లో కళాకారుడు ఆవిష్కరించాడు. ఈ గుడిని రంగోలీలో అందంగా చిత్రించినందుకు చాలా సంతోషంగా ఉంది.. హిందువులు రామమందిరాన్ని చూసి గర్వపడుతున్నారు.. రామమందిరాన్ని రంగోలీగా వేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే చూపరుల ప్రశంసలు తన కష్టాన్ని మరపించాయని చెబుతున్నాడు. ఆ కళాకారుడు.

మరో వైపు బసవేశ్వర్ నగరంలోని ఫ్లోరెన్స్ పాఠశాలలో పిల్లలకు అయోధ్య గురించి తెలియాలని పాఠశాలలో థర్మాకోల్‌తో రామమందిరాన్ని నిర్మించి రామమందిర రూపకల్పనపై చిన్నారులకు అవగాహన కల్పించారు. .

ఇవి కూడా చదవండి

మరోవైపు రామోత్సవ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కావడంతో విమాన టిక్కెట్ల ధరలు పెరిగాయి. బెంగళూరు నుంచి అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య పెరగడంతో బెంగళూరు నుంచి అయోధ్యకు వెళ్లే విమాన టికెట్ ధర 6 వేల నుంచి 25 వేలకు పెరిగింది.

శని, ఆదివారాలు సెలవులు కావడంతో ప్రారంభోత్సవానికి ముందే అయోధ్యకు చాలా మంది ప్రయాణికులు వెళుతుండగా, 6వేలు ఉన్న టికెట్ రేటు 20వేలు దాటింది. వాస్తవంగా బెంగళూరు నుంచి అయోధ్యకు విమాన టికెట్ ధర 6 వేల రూపాయలు. జనవరి 19, శుక్రవారం బెంగళూరు నుండి అయోధ్యకు ఒక్క టికెట్ ధర సుమారు రూ. 25,000-26,000. ఇక జనవరి 20న బెంగళూరు నుంచి అయోధ్యకు టిక్కెట్టు రూ.28,886గా నిర్ణయించారు. ఈ రెండు రోజులు రెండు విమానాలు మాత్రమే బయల్దేరనున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెరిగాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..