Telangana: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ కొరడా.. ఫైర్ సేఫ్టీ లేని 15 బస్సులపై కేసులు నమోదు

ప్రయివేట్ ట్రావెల్ బస్సులు కూడా పండగ సీజన్ ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Telangana: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ కొరడా.. ఫైర్ సేఫ్టీ లేని 15 బస్సులపై కేసులు నమోదు
Rto Officers Ride
Follow us
Surya Kala

|

Updated on: Jan 13, 2024 | 5:10 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లె బాట పట్టారు. తమ సొంతూరిలో అయినవారి మధ్య పండగ సంబరాలను జరుపుకోవడానికి భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దీంతో బస్సులు, రైళ్లు అన్నీ ప్రయాణీకులతో నిండిపోతున్నాయి. ప్రయివేట్ ట్రావెల్ బస్సులు కూడా పండగ సీజన్ ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాయి. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టిఏ అధికారుల దాడులు నిర్వహించారు.

మహబూబ్‌నగర్‌ బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీకి ఏర్పాట్లు చేయకుండా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కాయి. రూల్స్‌ పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

సంక్రాంతికి భారీగా సొంతూళ్లకు జనం వెళ్తున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఈ టోల్ వద్ద హైదరాబాద్- విజయవాడ వైపు పది టోల్ బూత్‌లను జీఎంఆర్‌ ఓపెన్ చేసింది. అలాగే నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద కూడా రద్దీ కొనసాగుతోంది. కొర్లపహాడ్ వద్ద ఎనిమిది టోల్ బూత్‌లను సిబ్బంది తెరిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..