AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Horoscope: ఫిబ్రవరి 14 రాశి ఫలాలు.. వాహన యోగాలు.. ఆకస్మిక ప్రయాణాలు.. నూతన పరిచయాలు..

మనం ఎంత డిజిటల్ యుగంలోకి మారిన ఇప్పటికీ.. రాశిఫలాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. తమ భవిష్యత్తులో ఏం కాబోతుందనేది ముందుగానే

Today Horoscope: ఫిబ్రవరి 14 రాశి ఫలాలు.. వాహన యోగాలు.. ఆకస్మిక ప్రయాణాలు.. నూతన పరిచయాలు..
Rajitha Chanti
|

Updated on: Feb 14, 2021 | 7:55 AM

Share

మనం ఎంత డిజిటల్ యుగంలోకి మారిన ఇప్పటికీ.. రాశిఫలాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. తమ భవిష్యత్తులో ఏం కాబోతుందనేది ముందుగానే తెలుసుకోవడానికి చాలా మంది ఉత్సుకతో ఉంటాయి. అయితే వాటిని ముందుగానే అంచనాలు వేసి.. రాశిఫలాలు, వారఫలాలుగా పండితులు తెలుపుతుంటారు. ఆరోజున వారికి ఎదురయ్యే సమస్యలు, పరిస్థితులు గురించి తెలియజేసి.. పరిహార దోషాలు తెలుపుతుంటారు. ఈరోజు ఫిబ్రవరి 14 ఆధివారం నాడు 12 రాశుల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం..

మేషరాశి.. ఈ రోజు ఈ రాశివారు వ్యవహారిక విషయాల్లో మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషంగా పేరుప్రఖ్యతలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ప్రేమికులకు కూడా మంచి చేస్తుంది. ఈరోజు గౌరీ దేవి ఆరాధన చేస్తే మీకు మంచి జరుగుతుంది.

వృషభ రాశి.. ఈరాశి వారికి వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. అంతేకాకుండా సామాజిక సేవ కార్యక్రమాల్లో వీరు చురుకుగా పాల్గొంటుంటారు. మీ జీవితంలోని సమస్యలను దూరం చేసుకోవడానికి పేదవారికి అన్నధానం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిధున రాశి.. ఈరాశివారికి ఈరోజు వాహన యోగాలు ఉంటాయి. అలాగే పాత బాకీలు కూడా సాధ్యమైనంతవరకు వసూలు అవుతుంటాయి. ఈరోజు వీరు దత్తాత్రేయ స్వామివారి ఆరాధించడం ద్వారా శుభఫలితాలు కనిపిస్తాయి.

కర్కాటక రాశి.. ఈరాశివారికి ఈ ప్రేమికుల రోజున చేపట్టిన పనులన్ని సకాలంలో పూర్తవుతాయి. అలాగే సంఘంలో గౌరవాలు కూడా పెరుగుతాయి. ఈరోజున వీరు శివాభిషేకం చేస్తే మేలు కలుగుతుంది.

సింహరాశి.. ఈరాశివారు ఈరోజు ఎక్కువగా రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా కొన్ని ఆకస్మిక ప్రయణాలు కూడా చేస్తారు. వీరు ఈరోజు నవగ్రహ స్త్రోత్ర పరాయణం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి.. ఈ రాశివారు ఈరోజు వ్యవహారిక విషయాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ప్రతివిషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈరోజున విష్ణు సహస్త్ర స్తోత్ర పరాయణం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి. తులరాశి. ఈరాశివారికి నూతన పరిచయాలు విస్తృతమవుతాయి. ప్రయోజనాలను సరైన సమయంలో తీసుకుంటారు. వీరు ఈరోజున వారికి ఇష్టమైన దేవుడిని ఆరాధన చేయడం మంచిది.

వృశ్తిక రాశి.. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. అలాగే సామాజిక సేవా కార్యాక్రమాల్లో కూడా వీరు చురుకుగా పాల్గోంటారు. ఈరోజు వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం వలన మంచి జరుగుతుంది.

ధనస్సు రాశి.. ఈ రాశివారు ఈరోజు ఖర్చుల విషయంలో కొంతవరకు నియంత్రణగా ఉండాలి. అలాగే ఉద్యోగంలో ఒత్తిడికి గురవుతారు. ఈరోజు శ్రీరాముని నామస్మరణ చేయడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు.

మకర రాశి.. ఈ రాశివారికి ఈరోజున కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి. అలాగే ఇతరులతో వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజున గురుగ్రహ స్తోత్ర పరాయణం చేయడం శుభఫలితాలనిస్తుంది.

కుంభ రాశి.. కుంభరాశివారికి ఈరోజున ఇతరుల నుంచి రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. వీరికి బద్ధకం కూడా పెరుగుతుంది. ఈరోజున ఈ రాశివారు విలువైన వస్తువుల పట్ల జగ్రత్తగా ఉండాలి. శుభఫలితాల కోసం దుర్గదేవి ఉపాసన చేయడం మంచిది.

మిన రాశి.. ఈ రాశివారికి ఈరోజు చేపట్టిన పనులలో చురుకుగా వ్యవహారిస్తే లాభాలతో పాటు గౌరవాలు కూడా పొందుతారు. అలాగే ఇతరులతో వీరు వ్యవహారించే విషయంలో అనుకూలత ఉంటుంది. అవేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మరిన్ని శుభఫలితాల కోసం గోసేవా చేయడం.. పేదవారికి కాయగూరలు ధానం చేయడం మంచిది అని చెప్పుకోవచ్చు.

Also Read: భూగోళంపై మహా ప్రళయమట..! ప్రపంచం అంతం కాబోతోందంటూ కొత్త లెక్కలు