AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips for Cow: ఆవుకి రోజూ ఆహారం అందించడం వలన కలిగే ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు , సమతుల్యతను కోరుకుంటారు. అయితే జీవితంలో సుఖ సంతోషాల కోసం సిరి సంపదల కోసం కొన్ని పవిత్రమైన ఫలవంతమైన చర్యలు తీసుకోవాలి. అందులో ఒకటి ఆవుకు ఆహారం అందించడం. ఇప్పటి వరకూ ఆహరం ఇవ్వకపోతే.. ఈ రోజు నుంచి ఆహారం అందించడం మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు ఆవుకి పెట్టే ఆహరం మీ విధిని మార్చగలదు!

Astro Tips for Cow: ఆవుకి రోజూ ఆహారం అందించడం వలన కలిగే ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
Astro Tips For Cow
Surya Kala
|

Updated on: May 02, 2025 | 4:24 PM

Share

భారతీయ సంస్కృతిలో ఆవు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో ఆవుని గోమాతగా పూజిస్తారు. ఆవుకు ఆహరం అందించడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. దాని వెనుక లోతైన మత, ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం.. పురాతన కాలంలో ఎంత ప్రభావవంతంగా ఉందో.. నేడు కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తారు. ఆవుకు రోజూ ఆహారం అందించడం వలన ఎటువంటి ప్రయోజనాలు లభిస్తాయో వివరంగా తెలుసుకుందాం.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఆవులో నివసిస్తారని నమ్మకం. కనుక ఆవుకి ఆహరం అందిస్తే సకల దేవతలకు ఆహారం అందించినట్లే. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను ఒకేసారి పొందుతారు. ఆవుకు ఆహారం ఇచ్చే వ్యక్తికి దేవుడికి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలలో స్పష్టంగా ప్రస్తావించబడింది. ఆవుకు బెల్లం అందించడం అంటే యాగం చేసి దానధర్మాలు చేసినంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. శనీశ్వరుడు, పితృ దోషాలతో బాధపడుతున్న వారు ఆవుకు, మేత లేదా బెల్లం, ఆహారం క్రమం తప్పకుండా తినిపించాలని జ్యోతిష్యులు చెప్పారు. ఇలా చేయడం వలన జాతకంలో దోషాలను తగ్గించడమే కాదు జీవితంలో అదృష్టం, ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది.

ఆవులు శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనవి. కనుక కన్నయ్య ఆశీర్వాదాన్ని పొందే ఆశీర్వాదం పొందేందుకు మార్గాలు. కన్నయ్య బాల్యం అంతా ఆవులతో గడిచింది. అందుకే గోవిందుడు, గోపాలుడు వంటి పేర్లతో పిలుస్తారు. ఆవుకు సేవ చేసే వ్యక్తి లేదా ఆవుకి ఆహారం అందించే వ్యక్తి శ్రీకృష్ణుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.

ఇవి కూడా చదవండి

లక్ష్మీదేవి అనుగ్రహం.. సంపద వృద్ధి: శాస్త్రాల ప్రకారం ఆవుకు ఆహారం అందించడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో మొదటి ఆహారాన్ని ఆవుకు ఇచ్చినప్పుడు అది శుభ సంకేతంగా భావిస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈ నియమాన్ని క్రమం తప్పకుండా పాటిస్తే జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజూ ఆవుకు ఆహారం అందించిన తర్వాత మాత్రమే ఆహారం తినే వ్యక్తి ఇంట్లో ఆహారం, డబ్బు కొరత ఎప్పుడూ ఉండదని కూడా నమ్ముతారు.

ఆధ్యాత్మిక ప్రయోజనం.. కర్మ శుద్ధి: ఆవుకు రొట్టె తినిపించడం వల్ల వ్యక్తి మనస్సులో సేవాభావం, కరుణ పెరుగుతాయి. ఇది ఆధ్యాత్మిక సమతుల్యతను అందించే సాధన లాంటిది. ఏ జీవికి అయినా ముఖ్యంగా ఆవు వంటి పవిత్ర జీవికి, ఎలాంటి స్వార్థం లేకుండా ఆహారం ఇచ్చినప్పుడు మనలో సానుకూల శక్తి పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా దీనిని కర్మల శుద్ధి మాధ్యమంగా కూడా పరిగణిస్తారు. ప్రతికూల ఆలోచనలతో ఇబ్బంది పడేవారు లేదా తరచుగా మనస్సు కలవరపడే వారికి ఈ అభ్యాసం చాలా ఫలవంతమైనదని నిరూపించబడింది.

శాస్త్రీయ దృక్కోణంలో ప్రయోజనాలు: ఆవుకు ఆహారం అందించడం వెనుక మతపరమైన, శాస్త్రీయ అంశాలు ఉన్నాయి. మనం ఆవులకు ఆహారం అందించినప్పుడు.. అది మానవత్వాన్ని సూచించడమే కాదు పర్యావరణ సమతుల్యతకు కూడా సహాయపడుతుంది. ఈ సంప్రదాయం సమాజంలో గోవుల పెంపకం, గో రక్షణను కూడా ప్రోత్సహిస్తుంది. గో సంరక్షణ ఒక విధంగా సేంద్రీయ వ్యవసాయం, సహజ ఎరువు, పర్యావరణ పరిరక్షణను కూడా ప్రోత్సహిస్తుంది. ఆవులు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నప్పుడు వాటి ఉత్పత్తులు అయిన పాలు, ఆవు పేడ, ఆవు మూత్రం మొదలైనవి సమాజానికి మేలు చేస్తాయి. ఈ దృక్కోణంలో చూస్తే, ఆవుకు ఆహారం అందించడం ఒక సామాజిక, పర్యావరణ బాధ్యతకు చిహ్నంగా మారుతుంది.

మానసిక , కుటుంబ సమతుల్యతను కాపాడుకోవడానికి: మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇది ఆధ్యాత్మిక సమతుల్యతను సాధించడమే కాదు కుటుంబ సంబంధాలను కూడా మధురంగా ​​మార్చే పని. ఆవుకు క్రమం తప్పకుండా ఆహారం అందించే ఇళ్లలో, వాతావరణం సానుకూలంగా, ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి కుటుంబాలలో పరస్పర సహకార భావన అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో ఉద్రిక్తత పరిస్థితి తగ్గుతుంది. దీనిని ఒక రకమైన ‘సామూహిక ధర్మం’గా కూడా పరిగణిస్తారు, దీనిలో మొత్తం కుటుంబం ప్రయోజనం పొందుతుంది.

ఆవుకి ఆహారం అందించే సమయంలో వీటిని గుర్తించుకోండి

ఆవుకు ఆహారం తినిపించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.

ఆవుకు ఎప్పుడూ ఎండిన లేదా పాచిపోయిన ఆహారాన్ని తినిపించవద్దు. అదే విధంగా ఆవుకి పెట్టే ఆహారంలో కొద్దిగా బెల్లం లేదా నెయ్యి కలపడం శుభప్రదంగా భావిస్తారు.

ఆహారాన్ని కేవలం లాంఛనప్రాయంగా కాకుండా ప్రేమతో, గౌరవంతో ఇవ్వాలి.

పురాణ శాస్త్రాల ప్రకారం ఇంట్లో మొదట ఆహారాన్ని ఆవుకు, చివరి ఆహారాన్ని కుక్కకు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. పితృ దోషం కూడా తొలగిపోతుంది.

ఆవుకు ఆహరం అందించడం ఒక మతపరమైన సంప్రదాయం కాదు.. ఇది సమాజం, పర్యావరణం, ఆత్మ, ఆర్థిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపే జీవిత తత్వశాస్త్రం. ఇది ఒక చిన్న చర్య.. అయితే దీని ప్రభావం లోతైనది. చాలా విస్తృతమైనది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు