AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Purana: వంటని ఇలా చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో ఎల్లపుడూ ఉంటుంది.. సిరి సంపదలకు లోటు ఉండదు..

హిందువుల 18 పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. ఈ గరుడ పురాణికి అధిపతి శ్రీ మహా విష్ణువు. ఇందులో మనిషికి సంబంధించిన జనన మరణాల గురించి వివరించబడింది. మనిషి జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు.. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం.. పునర్జన్మ గురించి కూడా పెర్కొనది. అదే విధంగా మనిషి జీవించి ఉన్న సమయంలో ఏపనులు చేయాలి.. ఏమి చేయకూడదో కూడా వివరించింది. వంటగదికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలను గరుడ పురాణంలో ప్రస్తావించింది. గరుడ పురాణంలోని ఈ నియమాలను పాటించడం ద్వారా జీవితంలో సంపద, శ్రేయస్సుకు కొరత ఉండదని పేర్కొంది. వంటగది ఎలా ఉంటే శుభం కలుగుతుందో తెలుసుకుందాం.

Garuda Purana: వంటని ఇలా చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో ఎల్లపుడూ ఉంటుంది.. సిరి సంపదలకు లోటు ఉండదు..
Garuda Puranam
Surya Kala
|

Updated on: May 02, 2025 | 2:56 PM

Share

ఇంట్లో వంటగది చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అనేక పురాణ గ్రంథాలలో వంటగది గురించి ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. గరుడ పురాణంలో వంటగది గురించి ముఖ్యమైన విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణం వంటగది గురించి ప్రత్యేక విషయాలను చెప్పింది. ఏ వస్తువు ప్రతిరోజూ వంటగదిలో ఉండాలో కూడా పేర్కొంది. దీని ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్న ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. గరుడ పురాణంలో ప్రస్తావించబడిన ఏ పని జీవితాంతం డబ్బుకు కొరత లేకుండా చూస్తుందో తెలుసుకుందాం.

ముందుగా వంటగదిని పూజించండి.

గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ఆహారం వండడానికి వెళ్ళినప్పుడల్లా అతను ముందుగా వంట చేసే స్టవ్ కి దణ్ణం పెట్టాలి. గరుడ పురాణం ప్రకారం ఇలా వంట చేసే మంటకు దణ్ణం పెట్టి తర్వాత ఆహారం సిద్ధం చేయాలి. అలా ఆహారం రెడీ చేసిన తర్వాత వండిన వంటను మొదట నైవేద్యంగా స్టవ్ అంటే అగ్నికి సమర్పించాలి. గరుడ పురాణం ప్రకారం ఇలా క్రమం తప్పకుండా చేస్తే లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది. ఇది మాత్రమే కాదు లక్ష్మీ దేవి ఆశీర్వాదం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే అప్పుల సమస్య కూడా తొలగిపోతుంది. అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. దేవుడి ఆశీస్సులతో ఇంటి లో కొరత అన్న మాట ఉండదు.

వంటగదిని శుభ్రంగా ఉంచండి

గరుడ పురాణం ప్రకారం లక్ష్మీ దేవికి కోపం రాకూడదు అని అనుకుంటే ఎల్లప్పుడూ వంటగదిని శుభ్రంగా ఉంచండి. గరుడ పురాణం ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి మురికిని ఇష్టపడదు. అటువంటి పరిస్థితిలో ఎక్కడ మురికి ఉంటే అక్కడ జేష్టాదేవి నివసిస్తుంది. జేష్టాదేవి ఉన్న చోట సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి అక్కడ నివసించదు.

ఇవి కూడా చదవండి

తులసికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు

స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోవద్దు. తులసీదళాలు కోయవద్దు. ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం చేయకుండా తులసి ఆకులను కోయకండి. ఇది అపవిత్రమైన చర్యగా పాపంగా పరిగనించబడుతుంది.

ఆదివారం తులసి ఆకులను కోయవద్దు. తులసి ఆదివారం ఉపవాసం ఉంటుంది.. విశ్రాంతి తీసుకుంటుందని విశ్వాసం. కనుక ఈ రోజున తులసి ఆకులను కోయకూడదు. అంతేకాదు ఏకాదశి, సంక్రాంతితో పాటు సాయంత్రం సమయంలో తులసి ఆకులను కోయకూడదు.

తులసి మొక్కకు నీరు పెట్టడం: ప్రతిరోజూ.. ముఖ్యంగా సూర్యోదయం సమయంలో తులసి మొక్కకు నీరు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పాపాలు నశించి ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి.

తులసిని అవమానించ వద్దు: తులసి మొక్క దగ్గరకు బూట్లు , చెప్పులతో వెళ్ళవద్దు. తులసి మొక్కడ పరిసర ప్రాంతాల్లో ఉమ్మివేయకూడదు లేదా చెత్త వేయకూడదు. తులసిని అవమానించడం వల్ల వ్యక్తీ చేసిన పుణ్యం నశిస్తుంది. పాపం చుట్టుకుంటుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
చేతిలో స్మార్ట్‌‌ఫోన్ ఉన్నా తోడులేని జీవితం.. 35 శాతం యువత
చేతిలో స్మార్ట్‌‌ఫోన్ ఉన్నా తోడులేని జీవితం.. 35 శాతం యువత
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా
పెళ్లి పేరుతో AAP నేతనే బురిడీ కొట్టించిన మహిళ!
పెళ్లి పేరుతో AAP నేతనే బురిడీ కొట్టించిన మహిళ!
ఏపీ గృహ నిర్మాణంలో సరికొత్త విప్లవం.. రూ.2.50 లక్షలకే 90 ఏళ్లు
ఏపీ గృహ నిర్మాణంలో సరికొత్త విప్లవం.. రూ.2.50 లక్షలకే 90 ఏళ్లు
ఆవులు రోజూ ఎన్ని గంటలు నిద్రపోతాయి..? 99శాతం మందికి తెలియని..
ఆవులు రోజూ ఎన్ని గంటలు నిద్రపోతాయి..? 99శాతం మందికి తెలియని..
రవ్వలడ్డూలు మెత్తగా, మధురంగా ఉండాలా.. ఈ ట్రిక్ మీకోసమే
రవ్వలడ్డూలు మెత్తగా, మధురంగా ఉండాలా.. ఈ ట్రిక్ మీకోసమే
JBL నుంచి అదిరిపోయే PartyBox స్పీకర్లు.. పవర్‌ఫుల్ సౌండ్‌తో..
JBL నుంచి అదిరిపోయే PartyBox స్పీకర్లు.. పవర్‌ఫుల్ సౌండ్‌తో..
అద్దె ఇంటికి మారుతున్నారా? ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి.. లేదంటే
అద్దె ఇంటికి మారుతున్నారా? ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి.. లేదంటే
రాసిపెట్టుకోండి.. ఈ ఏడాది చివరికల్లా వీరికి అనూహ్య పురోగతి
రాసిపెట్టుకోండి.. ఈ ఏడాది చివరికల్లా వీరికి అనూహ్య పురోగతి
మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్.. కీలక నిర్ణయాలు
మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్.. కీలక నిర్ణయాలు