Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veerabrahmendra Swamy Mutt : ముగిసిన మంత్రి మూడు రోజుల గడువు, వీర బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి విషయంలో రాని సయోధ్య

కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి మఠం పిఠాధిపతి విషయంలో రేగిన వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇటీవల శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి..

Veerabrahmendra Swamy Mutt : ముగిసిన మంత్రి మూడు రోజుల గడువు,  వీర బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి విషయంలో రాని సయోధ్య
Pothuluri Veerabrahmendra S
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 22, 2021 | 8:29 AM

Pothuluri Veerabrahmendra Swamy Mutt : కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి విషయంలో రేగిన వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇటీవల శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి యొక్క ఇరువురు సంతానంతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చర్చలు జరిపి మూడు రోజులు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మూడు రోజుల్లో ఏ ఒక్కరు కూడా చర్చల కోసం కూర్చొని కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు. ఇచ్చిన మూడు రోజులు గడువు ముగియడంతో పీఠాధిపతి ఎంపిక విషయంలో ఇక, ధార్మిక పరిషత్, దేవాదాయ శాఖ జోక్యం చేసుకోనున్నాయి.

కాగా, మఠం పీఠాధిపతిగా పెద్ద కొడుకుగా వంశపారంపర్యంగా నేనే అర్హున్నీ అని పెద్ద భార్య పెద్ద కొడుకు వెంకటాద్రి స్వామి అంటుంటే, అమ్మకి కిడ్నీ దానం చేశాను.. వీలునామా ప్రకారం నాకే పీఠాధిపతి ఇవ్వాలని రెండో కొడుకు వీర భద్ర స్వామి కోరుతున్నారు. మరోవైపు, స్వామి వారి చివరి కోరిక, రాసిన వీలునామా ప్రకారం నా కొడుకు నే పీఠాధిపతి చేయాలి.. లేదంటే నేనే సంరక్షకురాలిగా ఉంటానని రెండో భార్య మారుతి మహాలక్ష్మి అంటున్నారు. దాదాపు నెల రోజులు గడుస్తున్నా కుటుంబసభ్యుల మధ్య ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతో ఈ అంశం మీద వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండటంతో పాటు, ఇప్పుడు మఠం పీఠాధిపతి ఎంపిక క్రమంగా దేవాదాయ శాఖ అధీనంలోకి పోతోంది.

కాగా మఠం పూర్వాపరాల్లోకి వెళ్తే.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి కోసం వారసుల మధ్య వైరం కొనసాగుతోంది. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి వారసుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది వివాదాస్పదంగా మారింది. ఆయన ఇద్దరు భార్యల కుమారుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది చిక్కుముడిగా మారింది.

కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో జీవ సమాధి అయ్యారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి, దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటున్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటివరకు ఇలా ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు.

మొన్నటి వరకు బ్రహ్మంగారి పీఠాధిపతిగా వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి ఉండేవారు. అయితే, ఇటీవల ఆయన మరణించడంతో పీఠాధిపతి పదవి ఖాళీ అయింది. ఇప్పుడా పదవి ఎవరికి ఇవ్వాలనేది పీటముడిగా మారింది.

వీరభోగవసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతమ్మ 8 మంది సంతానం. అందులో నలుగురు కుమారులు, నలుగురు కూతుళ్లున్నారు. మొదటి భార్య మృతి చెందడంతో రెండో భార్యను వివాహం చేసుకున్నారు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు. అయితే వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మరణం తర్వాత మఠం పీఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై ఓ వీలునామా రాసి పెట్టారు. అందులో మొదటి భార్యకు చెందిన రెండో కుమారుడు, చిన్న భార్యకు చెందిన ఒక కొడుకు పేరు రాశారు. దీంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

మఠాధిపతి నియామకం కోసం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణాప్రతాప్‌ ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే రాణాప్రతాప్‌ సమక్షంలోనే పీఠాధిపతికి అర్హులు నేనంటే నేనంటూ కుటుంబీకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రాథమిక విచారణను మధ్యలోనే నిలిపివేశారు రాణాప్రతాప్‌.

అయితే, గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికే ఇవ్వాలని మద్దతు తెలుపుతున్నారు. ఇంటికి పెద్ద కొడుకు కనుక ఆయనకే ఇవ్వాంటున్నారు. అయితే వీలునామాలో మాత్రం మొదటి భార్య రెండో కుమారుడి పేరు ఉంది. పెద్ద భార్య కిడ్నీ ఫెయిల్ అయిన సమయంలో ఎవరైతే కిడ్నీ ఇస్తారో తదుపరి పీఠాధిపతి వారేనని ప్రకటించారు. అప్పుడు రెండో కుమారుడు ముందుకు వచ్చాడు. దీంతో అతని పేరును వీలునామాలో రాశారు. దీంతో ఆయనకు కొందరు మద్దతు తెలుపుతున్నారు.

మరోవైపు, వీలునామాలో తన కుమారుడి పేరు ఉందని, అయితే చిన్నవాడు కావడంతో తానే మఠాధిపత్యాన్ని స్వీకరిస్తానని చెబుతోంది చిన్న భార్య మారుతి లక్ష్మమ్మ. తన భర్త తర్వాత తనకే మఠాధిపత్యం వస్తుందని వీలునామాలో రాశారని వాదిస్తున్నారు.

Read also : India Vaccinates : దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాల పంపిణీ.. నిన్న ఒక్కరోజులోనే 85 లక్షలకు పైగా ప్రజలకు వ్యాక్సినేషన్

మనసు మార్చుకున్న జక్కన్న.. మహేష్ మూవీ ఆలా రావటం లేదా.?
మనసు మార్చుకున్న జక్కన్న.. మహేష్ మూవీ ఆలా రావటం లేదా.?
225 మంది ప్రయాణికులతో గాల్లో విమానం. మరికొద్దిక్షణాల్లో పేలుతుంది
225 మంది ప్రయాణికులతో గాల్లో విమానం. మరికొద్దిక్షణాల్లో పేలుతుంది
రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!
రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!
సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు వెల్లువెత్తుతున్న విషెస్..
సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు వెల్లువెత్తుతున్న విషెస్..
ఆ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి అమ్మవారి ముందు ప్రతిరోజు విచిత్ర ఘటన
ఆ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి అమ్మవారి ముందు ప్రతిరోజు విచిత్ర ఘటన
హజ్ యాత్ర వేళ భారత్ సహా 14 దేశాలకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా..
హజ్ యాత్ర వేళ భారత్ సహా 14 దేశాలకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా..
కోహ్లీ, బుమ్రా మధ్య ఫన్నీ రన్‌ఔట్ డ్రామా వైరల్!
కోహ్లీ, బుమ్రా మధ్య ఫన్నీ రన్‌ఔట్ డ్రామా వైరల్!
నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు నిర్ధారణ
నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు నిర్ధారణ
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..!రెండు ముక్కలుగా విడిపోయి
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..!రెండు ముక్కలుగా విడిపోయి
నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.
నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.