Covid Vaccine : దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాల పంపిణీ.. నిన్న ఒక్కరోజులోనే 85 లక్షలకు పైగా ప్రజలకు వ్యాక్సినేషన్
భారత దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాల పంపిణీ జరుగుతోంది. టీకా కార్యక్రమం చేపట్టి నిన్నటికి 157వ రోజుకు చేరగా, నిన్న ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా సుమారు 85..
India New Vaccine Regime : భారత దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాల పంపిణీ జరుగుతోంది. టీకా కార్యక్రమం చేపట్టి నిన్నటికి 157వ రోజుకు చేరగా, ప్రపంచంలోనే అత్యధికంగా నిన్న ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా సుమారు 85 లక్షలకు పైగా ప్రజలకు కరోనా టీకా వేశారు. మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 16 లక్షలకు పైగా మందికి కొవిడ్ టీకాలు వేశారు. రికార్డు స్థాయిలో టీకాల పంపిణీ పై ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు. టీకాలు పంపిణీలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కృషిని ప్రధాని ప్రశంసించారు.
” ఇవాళ రికార్డు స్థాయిలో జరిగిన టీకా పంపిణీ జరగడం పట్ల సంతోషంగా ఉంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో వ్యాక్సినే మన ప్రధాన ఆయుధం. టీకా తీసుకున్న వారికి.. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తున్న ఫ్రంట్లైన్ వర్కర్లకు నా అభినందనలు. పేదలు, మధ్య తరగతి, యువతే ప్రధానంగా ఈ విడత వ్యాక్సినేషన్ జరుగుతోంది. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.” అని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
కాగా, కేంద్రం సవరించిన టీకా విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఒక్కరోజే 85.15 లక్షలకుపైగా డోసుల పంపిణీ జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 28.36 కోట్ల డోసుల టీకా పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానంలో భాగంగా 75 శాతం టీకాలను కేంద్రమే ఉచితంగా అందిస్తుంది. 25 శాతం టీకాలను ప్రైవేటుకు కేటాయిస్తోంది. అంతకుముందు కేవలం 50 శాతం మాత్రమే ఉచితంగా పంపిణీ చేసేది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ విధానంలో మార్పులు చేసిన కేంద్రం నూతన విధానంలో టీకాల పంపిణీ కార్యక్రమం అమలు చేస్తోంది.
Today’s record-breaking vaccination numbers are gladdening. The vaccine remains our strongest weapon to fight COVID-19. Congratulations to those who got vaccinated and kudos to all the front-line warriors working hard to ensure so many citizens got the vaccine.
Well done India!
— Narendra Modi (@narendramodi) June 21, 2021
Nearly 83 Lakh #COVID19 vaccine doses administered so far, on Day -1 of the implementation of ‘Revised Guidelines for #COVID19Vaccination‘. (As on 21st June, 2021, till 09:00 PM)#LargestVaccinationDrive #We4Vaccine pic.twitter.com/khCPL967TW
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 21, 2021