Horoscope Today: ఈ రాశులవారు.. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Horoscope Today 22nd June 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

Horoscope Today: ఈ రాశులవారు.. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..
Horoscope
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 22, 2021 | 7:07 AM

Horoscope Today 22nd June 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 22న) మంగళవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి.. ఈరోజు వీరు విలువైన వస్తువులు, ఆభరణాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు. రావాల్సిన కొన్ని ప్రయోజనాలు అందుకునే అవకాశాలున్నాయి. లలితా సహస్త్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృషభ రాశి.. ఈరోజు వీరు నూతన ఉద్యోగ లాభాలు.. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని శుభఫలితాల కోసం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మిథున రాశి.. ఈరోజు వీరికి తాము చేపట్టిన పనులలో చక్కని శ్రమకు సరిగ్గా వ్యవహరిస్తూ.. కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. పలు రకాల కుటుంబ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు సన్నిహితులతో కలిసి భవిష్యత్తులో తీసుకునే కొన్ని నిర్ణయాల గురించి ఆలోచనలు చేస్తుంటారు. రుణ ప్రయాత్నాలు కొనసాగుతుంటాయి. మహా గణపతి స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

సింహరాశి.. ఈరోజు వీరు ఆలయాలు, ఆశ్రమాలు సందర్శించే అవకాశాలున్నాయి. చేపట్టిన.. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయి. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కన్యరాశి.. ఈరోజు వీరు వ్యవహారిక విషయాల్లో శుభ ఫలితాలు పొందుతుంటారు. వ్యాపారంలో అభివృద్ధిని పొందుతుంటారు. మంగళ గౌరి దేవిని దర్శించుకోవడం మంచిది.

తుల రాశి.. ఈరోజు వీరు విలువైన వస్తువులను సేకరించే ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగాల విషయంలో సమస్యలు నెమ్మదిగా తగ్గుతుంటాయి. సుదర్శన స్వామి నామ స్మరణ మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. అభిమానులు అనుచరుల యొక్క సంక్షేమం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్య నారాయణ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో ఏర్పాటు చేసుకునే చర్చలు ఫల ప్రదం అయ్యే అవకాశాలున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

మకర రాశి.. ఈరోజు వీరికి దగ్గర్లో ఉన్న వ్యక్తులను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. చిన్న చిన్న సభలు, చర్చల్లో పాల్గోనే అవకాశాలున్నాయి. శ్రీ విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభరాశి.. ఈరోజు వీరు స్నేహితులతో, బంధువులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతుంటాయి. ఆదిత్యా హృదయ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి.. ఈరోజు వీరు స్థిరాస్తుల విషయంలో ఉన్న వివాదాలను పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగాల విషయంలో నూతన ఉత్సాహం ఉంటుంది. శ్రీరాజా మాతంగై నమః నామ స్మరణ మేలు చేస్తుంది.

Also Read: Garuda Puranam: మనిషి చనిపోయిన తర్వాత ఇంట్లో గరుడ పురాణం ఎందుకు చదువుతారో తెలుసా.. ప్రాముఖ్యత వివరాలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!