Vastu Tips: వాస్తు ప్రకారం ఈ మొక్కలు అస్సలు ఇంట్లో ఉండకూడదట..
ప్రస్తుత కాలంలో మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం సర్వ సాధారణంగా మారింది. ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి. ఇంట్లో స్థలం లేని వాళ్లు బాల్కనీలో కూడా పెంచుతున్నారు. మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఇంట్లో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. గాలి కూడా ప్యూర్ అవుతుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో అస్సలు..
ప్రస్తుత కాలంలో మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం సర్వ సాధారణంగా మారింది. ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి. ఇంట్లో స్థలం లేని వాళ్లు బాల్కనీలో కూడా పెంచుతున్నారు. మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఇంట్లో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. గాలి కూడా ప్యూర్ అవుతుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో అస్సలు పెంచకూడదట. ఇలా పెంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. వాస్తుకు విరుద్ధంగా మొక్కల్ని పెంచడం వల్ల అన్నీ సమస్యలే వస్తాయని చెబుతున్నారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెంచకూడని ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొన్సాయి మొక్క:
ఇవి చూడటానికి చాలా చిన్నగా గుబురుగా ఉంటాయి. పెద్దగా అస్సలు పెరగవు. చూడటానికి చాలా ముచ్చటగా, అందంగా కనిపిస్తాయి. కానీ ఇలాంటి మొక్కల్ని అస్సలు ఇంట్లో పెంచకూడదు. వీటి లాటే ఇంటి అభివృద్ధి కూడా పెరగదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.
కాక్టస్ మొక్క:
ముళ్లతో ఉండే ఈ మొక్కల గురించి కూడా చాలా మందికి తెలుసు. వీటిని చాలా మంది ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి మొక్కలు అస్సలు ఇంట్లో ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ చెట్టులో ఉండే ముళ్ల మాదిరిగానే జీవితంలో కూడా అనేక ముళ్ల లాంటి సవాళ్లను ఎదుర్కొనాలట.
గోరింటాకు చెట్లు:
చాలా మంది ఇంటి వద్ద గోరింటాకు చెట్లను పెంచుతూ ఉంటారు. కానీ వీటిని ఇంట్లో కానీ, ఇంటి ఆవరణలో కానీ పెంచకూడదు. వీటి వలన కూడా వాస్తు దోషం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పాలు కారే మొక్కలు:
ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పాలు కారే మొక్కలు కూడా పెంచకూడదు. ఇవి వాస్తు పరంగా ఇంటికి దురదృష్టాన్ని తెచ్చి పెడతాయి. వాటి వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.
బాబూల్ మొక్క:
బాబూల్ చెట్టుకు కూడా ముళ్లు ఉంటాయి. ఇలాంటి మొక్కలను కూడా ఇంట్లో పెంచకూడదు. వీటిని వలన ఇంట్లో కుటుంబ తగాదాలు, అనారోగ్య సమస్యల వస్తాయి. చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీని తగ్గిస్తుంది.